November 2, 2012

ఎర్రన్నాయుడు మృతికి ప్రముఖుల సంతాపాలు...

తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతి పట్ల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం సంతాపం తెలియజేశారు. ఎర్రన్నాయుడు మృతి దేశానికి ఎంతో లోటు అని మన్మోహన్ సింగ్ అన్నారు. కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎంతో గుర్తింపు పొందాయని సోనియా గాంధీ ఈ సందర్భంగా చెప్పారు.

ఎర్రన్నాయుడు మృతికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి, సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బిసిలకు ఎర్ర్నాయుడి మృతి తీరని లోటు అని సీతారాం ఏచూరి అన్నారు.

ఎర్రన్నాయుడి మృతి బిసిలకు తీరని లోటు అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూనే బిసిల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఎర్రన్నాయుడి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం ఆదేశించారు. రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

రాష్ట్రం మంచి నేతను కోల్పోయింది : గవర్నర్ నరసింహన్

ఎర్రన్నాయుడు మృతిపై గవర్నర్ స్పందిస్తూ రాష్ట్రం ఓ మంచి నేతను కోల్పోయిందన్నారు. అలాగే, ఎర్రన్నాయుడు ఓ మంచి పార్లమెంటేరియన్ అని కూడా కొనియాడారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు చేసిన సేవలను గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎర్రన్న మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ఎర్రన్నాయుడు దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రం ఓ మంచి రాజకీయ నేతను కోల్పోయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు

  శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారు:
 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు

 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు మృతితో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారని ఆయన అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.  

 ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర:విజయమ్మ

ఎర్రన్నాయుడు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర నిర్వహించారని ఆమె అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

No comments :

No comments :