October 18, 2012

(17వ రోజు) పగలు విమర్శలు.. రాత్రి రాయబారాలు,ఎప్పుడైనా కాంగ్రెస్, వైసీపీ ఒక్కటే

ముందుంది మంచి కాలం
మన ప్రభుత్వం వస్తుంది
కొద్ది కాలం ఓపిక పట్టండి
ఏడాదికి పది సిలిండర్లు
గొర్రెల కాపరులకు పదెకరాలు
పంట నష్టపరిహారంగా ఎకరాకు పది వేలు
9 గంటల నిరంతర విద్యుత్తు..
సాగునీటికి సమగ్ర ప్రణాళిక
పగలు విమర్శలు.. రాత్రి రాయబారాలు
ఎప్పుడైనా కాంగ్రెస్, వైసీపీ ఒక్కటే

  "ఇంకా కొద్ది కాలమే. ఓపిక పట్టండి. అధైర్యపడొద్దు. మన ప్రభుత్వం వస్తుంది. మంచి కాలం వస్తుంది'' అని కర్నూలు జిల్లా పాదయాత్రలో తమ కష్టాలను చెప్పుకొన్న ప్రజలకు చంద్రబాబు ధైర్యం నూరిపోశారు. ఎమ్మిగనూ రు మండలం ఆరేకల్లు నుంచి 17వ రోజు గురువారం పాదయాత్రను ప్రారంభించిన బాబు అడుగడుగునా బడుగులను పలకరించారు. ఆరేకల్లులోని పొలాల్లో ఆముదం పంటలో పని చేసుకుంటున్న రైతు దంపతులతో.. కనుమదొడ్డి చెరువు వద్ద సీతాఫలాలు అమ్ముకునే జయలక్ష్మితో మాట్లాడారు.

మరోచో ట చెట్టు కింద ఉన్న మహిళలు, వృద్ధులతో నులక మంచంపై కూర్చుని సంభాషించారు. కల్లుగీత కార్మికులను పలకరించారు. గీత కార్మికులను ఆదుకుంటామని చెప్పడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపించింది. వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ పగలంతా ఒకదానిని మరొకటి విమర్శించుకుంటూ రాత్రంతా జగన్ బెయిల్ కోసం రాయబారాలు జరుపుతున్నాయని విమర్శించారు. గొర్రెలకు మేత లేక గొర్రెల కాపరులు నానా ఇబ్బందులు పడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే మేత కోసం పదెకరా లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

వంటగ్యాస్ సిలిండర్లను కాంగ్రెస్ ప్రభు త్వం ఆరుకు కుదించిందని, తాము అధికారంలోకి వస్తే 10 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. రైతుల గడ్డు పరిస్థితిని చూస్తే రుణ మాఫీ ఒకటే సరిపోదని అనిపిస్తోందని, ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయడంతోపాటు సాగునీటి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర నీటి యాజమాన్యం అభివృద్ధి చేస్తామని, అందుకు చట్టాన్ని తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.

పంట నష్ట పరిహారంగా ఎకరానికి రూ.2500 కాకుండా మరికొంత పెంచాలని 2004లో అప్పటి సీఎం వైఎస్‌కు తాను వివరించానని, అయినా పట్టించుకోలేదని, తాను అధికారంలోకి వస్తే పరిహారాన్ని ఎకరాకు 10 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో 9గంటలు నిరంతరంగా సేద్యానికి కరెంట్ ఇచ్చామ ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా ఇవ్వడం లేదన్నా రు. వైసీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, ఆ పార్టీ నేతల కారణంగానే రాయలసీమలో చాలా గ్రామాలు నాశనమైపోయాయని మండిపడ్డారు.

చంద్రబాబుకు రైతుల సన్మానం
రాష్ట్రంలో రైతుల కడగండ్లు గమనించి రుణ మాఫీపై హామీ ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మిగనూరు మండలం బోసిబండలో రైతులు సన్మానం చేశారు. సీపీఐకు చెందిన రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య అఖిల పక్ష రైతు సంఘం తరపున చంద్రబాబును కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ఆలూరు నియోజకవర్గం నుంచి సీపీఐ నేతలు ఎక్కడికక్కడ పాదయాత్రలో పాల్గొంటూ మద్దతు ప్రకటించారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని ప్రకటించినందుకు మహిళా సంఘం నాయకురాలు జోతిర్మయి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. ఎమ్మిగనూరులో చంద్రబాబు చేనేత కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలో 13 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానిక నాయకులు బాబు దృష్టకి తీసుకెళ్లడంతో.. వారి ఆత్మశాంతి కోసం గురువారం రాత్రి ఉపవాసం ఉంటున్నట్లు ప్రకటించారు. కాగా.. జీవవైవిధ్య సదస్సులో ప్రధాని మన్మోహన్ పర్యటనకు కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలపై వివక్ష చూపడం సరికాదని వ్యాఖ్యానించారు.
No comments :

No comments :