September 24, 2013

వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు

  కాంగ్రెస్‌తో వైసీపీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే జగన్‌కు బెయిల్ మంజూరైందని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రం హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణపై 2008లో తీసుకున్న నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కుమ్ముక్కై టీడీపీనీ టార్గెట్ చేస్తున్నాయన్నారు.


ఈ ప్రాంతానికి చెందిన వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం . వైసీపీ ఓ గజదొంగ పార్టీ అని, అలాంటి పార్టీతో కేసీఆర్ కుమ్ముక్కవడం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీని విలీనం చేసేందుకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటున్న కేసీఆర్‌కు టీడీపీని విమర్శించే అర్హత లేదని విమర్శించారు. సీమాం«ద్రుల కృషితోటే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తమకే హైదరాబాద్‌పై హక్కు ఉందని మాట్లాడుతున్న ఏపీఎన్జీవో నేత నోరు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. బతుకుదెరువు కోసం వచ్చారు కదాని కనుకరిస్తే ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ సీబీఐపై కాంగ్రెస్ ఒత్తిడి మేరకు జగన్‌కు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ధ్యేయంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.