September 24, 2013

నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చింది

 
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈకేసులో 10 చార్జిషీట్లలో 1200 కోట్ల అక్రమాలు జరిగాయని సీబీఐ చెప్పింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఈ కేసు మధ్యలో విచారణ అధికారిని ఎలా బదిలీ చేశారని విమర్శించారు. జగన్ బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదన్నారు. బెయిల్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియాలో క్విడ్‌ప్రోకో లేదని ఎలా చెబుతారన్నారు. జగన్ కేసులో దొంగ, పొలీస్ ఒకటయ్యారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.