August 8, 2013

హక్కులకు ఓకే.. సమైక్యానికి నో

తమ పార్టీ తెలంగాణకు అను కూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం వైఖరి మార్చుకోలేమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ''సచివాలయ సీమాంధ్రుల ఉద్యోగుల సంఘం'' ప్రతినిధులు బుధవారం చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. తమ పోరాటానికి మద్దతి వ్వాలని కోరారు. వారి కోరికను ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ, ప్రస్తుత దశలో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని వెనుకడుగు వేయలేమన్నారు. కనీసం తమ హక్కుల కోసం అయినా పోరాడాలని కోర గా అందుకు ఆయన సమ్మతించినట్లు ఉద్యోగ సంఘ ప్రతినిధి మురళీకృష్ణ తెలిపారు. తనకు తెలుగు వారి సంక్షేమం ముఖ్యమని చంద్రబాబు చెప్పి నట్లు వివరించారు. ఇరుప్రాంత ఉద్యోగుల్లో ఎవరూ నష్టపోరాదన్నదే తమ విధానమని.. ఆ దిశలో ఎవరి హక్కులకూ భంగం కలగకుండా చూస్తామని చంద్రబాబు నాయుడు హామీనిచ్చినట్లు తెలిపారు.