June 22, 2013

విజయవాడ గ్రేటర్‌కు అడ్డుపడితే ఖబడ్దార్

చిన్న చిన్న నగరాలు గ్రేటర్‌గా రూపాంతరాలు చెందుతుంటే.. రాష్ట్రంలోనే ఒక వ్యాపార కేంద్రగా గుర్తింపు పొందిన విజయవాడ స్థాయిని పెంచకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతోపాలు పలువురు నాయకులు అడ్డుకుంటున్నారు. గ్రేటర్ ప్రతిపాదనలు పంపకపోతే ప్రజలే మీ సంగతీ చూస్తారంటూ టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

  రాజకీయ మనుగడ కోసమే విజయవాడ గ్రేటర్ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రేటర్ హోదా కోసం తలపెట్టిన మహాధర్నా ఉదయం 10 గంటల నుంచిమధ్యాహ్నం రెండు గంటల వరకూ సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అర్భన్ అధ్యక్షుడు నాగుల్ మీరా అధ్యక్షత వహించారు. కేశినేని నాని మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందన్నారు. స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి నగరాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కన్నా ఈ నేతలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. నగర శ్రేయస్సు కోసం టీడీపీ ప్రజాస్వామ్యయతుంగా ఆందోళనలు చేస్తుంటే కేసులు పెడుతున్నారన్నారు. దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోసంఆందోళన చేస్తుంటే ఎనిమిది బనాయించారు. బెంజ్‌సర్కిల్ వద్ద ప్లైఓవర్ నిర్మాణం చేపట్టాలంటూ కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గు చేటు. అధికారంలో ఉండి పనులు చేయించలేక ధర్నాలు చేయడం చరిత్రలో ఎక్కడా లేదు.

వారు దద్దమ్మలు దేవినేని ఉమా, జిల్లా అధ్యక్షులు
విజయవాడ నగర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్, ముగ్గురు ఎమ్మెల్యేలు కళ్ళు తెరిపించడానికే ధర్నా నిర్వహించామని టీడీపీ జిల్లా అధ్యక్షడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్లైఓవర్ నిర్మాణాలకు, గ్రేటర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తుంది లగడపాటి సమాధానం చెప్పాలన్నారు. 1982లో నగరం 60 స్క్వేర్ కిలో మీటర్ల పరిధిలో ఉందని, 2013లో కూడా అదే పరిధిలోనే ఉంది. గ్రేటర్ ప్రతిపాదనలు పంపకుండా తొక్కిపెట్టిన కార్పొరేషన్ అధికారులను 2014లో వచ్చే తమ ప్రభుత్వ హయాంలో చెంచల్‌గూడా జైలుకు పంపడం ఖాయమన్నారు.

పంచాయతీ స్థాయికి దిగజార్చారు గద్దె రామ్మోహన్, తూర్పు ఇన్‌చార్జి
మాజీ ఎంపీ, తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జి గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చిన్న నగరాలైన రాజమండ్రి, గుంటూరు శరవేగంతో అభివృద్ధిని చెందుతుంటే విజయవాడ మాత్రమే పంచాయతీ స్థాయికి దిగజారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు విసిగిపోయారు బొండా ఉమా, సెంట్రల్ ఇన్‌చార్జి
కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని సెంట్రల్ ఇన్‌చార్జి బొండా ఉమా అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం.. విజయవాడ గ్రేటర్ కావ డం తథ్యం. ముఖ్యమంత్రిగా తొలిరోజే చంద్రబాబు గ్రేటర్ ఫైల్‌పై సంతకం చేస్తారన్నారు.

ఆరు నెలల తరువాత మాజీగా లగడపాటి నాగుల్‌మీరా, అర్బన్ అధ్యక్షుడు

రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన లగడపాటి రాజగోపాల్ ప్రజలకు చేసింది ఏమి లేదని అర్బన్ అధ్యక్షుడు నాగుల్ మీరా అన్నారు మరో ఆరు నెలల్లో ప్రజలు లగడపాటిని మాజీని చేస్తారన్నారు. ప్రతి ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, ఆ తరువాత ప్రజలను మోసం చేయడం లగడపాటికి అలవాటుగా మారిందన్నారు.

అభివృద్ధి నిరోధకులు కమ్యూనిస్టులు బుద్దా వెంకన్న, పశ్చిమ ఇన్‌చార్జి

నగరాభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కమ్యూనిస్టు నాయకులు విమర్శించడం సిగ్గుచేటని పశ్చిమ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. అభివృద్ధి జరగలేని ఒక పక్క ఉద్యమాలు చేస్తు న్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా మాట్లాడటం దారుణమన్నారు. వీరి ప్రవర్తన వల్ల ప్రభుత్వ అసమర్థత కప్పి పుచ్చుకునే అవకాశం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా గ్రేటర్, ప్లైఓవర్ల్ నిర్మాణాల కోసం టీడీపీ చేస్తున్న ఉద్యమాలకు కలిసి రావాలన్నారు.

మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, మాజీ ఉడా ఛైర్మన్ తూమాటి ప్రేమ్‌నాథ్, తెలుగుయువత నాయకుడు దేవినేని చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్లు గోగుల రమణ, ఎరుబో తు రమణ, చెన్నుపాటి గాంధీ, వీరంకి డాంగే, నాగేంద్రరెడ్డి తదితరుల పాల్గొన్నారు