February 24, 2013

వివక్ష పాఠశాల నుంచే...

మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎంతో తెలివైన వాళ్లు. ఏ పని అప్పగించినా సమర్థవంతంగా చేయగల శక్తి, సామర్థ్యాలు వారి స్వంతం. అయినా మన సమాజంలో ఆడపిల్లలపై వివక్ష నేటికీ కొనసాగుతూనే ఉన్నది. మగపిల్లలను ్రపైవేటు పాఠశాలల్లో, ఆడపిల్లలను ప్రభుత్వ బడులకు పంపుతారు. ఆడబిడ్డలపై వివక్ష అనేది ఇక్కడి నుంచే మొదలౌతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భట్టిప్రోలు మండలంలో తన రాకకోసం గంటల తరబడి ముం డుటెండలో నిరీక్షించిన విద్యార్థులతో చంద్రబాబు కాసేపు సరదాగా గడిపారు.

'ఏమి గర్ల్స్ బావున్నారా... గుడ్ ఆఫ్టర్‌నూన్... ఏంటి డల్‌గా చెబుతున్నారు... బాగా చదువుకొంటున్నారా... టీచర్స్ బాగా పాఠాలు చెబుతున్నారా' అంటూ కులాస ప్రశ్నలు వేశా రు. అనంతరం చంద్రబాబు ఆడపిల్లలపై కొనసాగుతోన్న వివక్ష గురించి ప్రస్తావించారు. మగ పిల్లలతో పాటు ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని తాను విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేశానని గుర్తు చేశా రు. ఆ నాడు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇప్పించాం. ఆ సైకిల్ ఇచ్చింది కళాశాలలకు వెళ్ళడానికే కాదు.

మగవాళ్లకు ధీటుగా తాము కూడా సైకిళ్లు తొక్కుతామని సమాజానికి చాటి చెప్పేందుకే తాను సైకిళ్లను పంపిణీ చేశానని చె ప్పారు. ఆడపిల్లలు ఎవరైనా ముందుకొస్తే ఆర్‌టీసీలో ్రడైవర్లు అయ్యే అవకాశం కూడా కల్పిస్తానని హామి ఇచ్చారు.

మీరు శారీరకంగా బలహీనులు కారు. మీకు అవకాశం ఇస్తే దూసుకెళతామని నిరూపిస్తారని చైతన్యం నింపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగేలా చేశానన్నారు. ఎవరైనా రౌడీలు తోక జాడితే వారికి ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ ఇచ్చాం. నేడు విద్యార్థినులు ఇంటినుంచి బయటకు వెళితే భద్రంగా ఇంటికొస్తుందనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ బాంబుపేలుళ్ల దుర్ఘటనలో శాశ్వత విద్యార్థినులు వికలాంగులయ్యా రు.

పోలీసులు, సీఎం జాగ్రత్తగా ఉంటే బాం బుపేలుళ్లు జరిగి ఉండేవి కావని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం తాను పటిష్ఠమైన చట్టాలను రూపొందించి అమలులోకి తీసుకొస్తానని హామి ఇచ్చారు.

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి దేశానికి స్వాత్రంత్యం తీసుకొచ్చిన గాంధీ జీ, రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్, తెలుగువారికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి పేదోడికి కూడు, గూడు, గుడ్డ ఇచ్చిన ఎన్‌టీఆర్ వంటి మహనీయులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. అదే జైలుకు వెళ్లిన నాయకులను ఆదర్శంగా తీసుకొంటే విద్యార్థుల జీవితాలు అంధకారమౌతాయని హెచ్చరించారు.