December 11, 2012

మీ ముఖాల్లో ఆనందం చూస్తా... చంద్రబాబు

నిర్మల్/దిలావర్‌పూర్/కుంటాల/లోకేశ్వరం/సారంగాపూర్: తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న మీకు తో డుగా నిలిచి మీ ముఖాల్లో ఆనందాన్ని నింపేందుకే తాను నేరుగా మిమ్మల్ని కలవడానికి వచ్చానని తెలుగుదేశం పా ర్టీ అధినేత నారా చంద్రబాబునాయు డు అన్నారు. మంగళవారం మండలంలోని సిర్గాపూర్, ట్యాల ఎక్స్‌రోడ్డుల వ ద్ద ప్రసంగించారు. ఈ సందర్భంగా ముజ్గి గ్రామానికి చెందిన మాడావి ల క్ష్మీ అనే మహిళ చంద్రబాబుకు పలు వి షయాలను వివరించారు. వచ్చిన పిం ఛన్లను కాంగ్రెసోల్లు కట్ చేశారని, ఇళ్లు లేని వారికి ఇప్పటికీ ఎవరూ ఇళ్లు క ట్టించి ఇవ్వడం లేదని, ఎవరూ పట్టించుోకపోతే మా బ్రతుకులు ఎట్లా అం టూ చంద్రబాబును ప్రశ్నించారు.

అ మ్మా లక్ష్మీ తొమ్మిదేళ్ల క్రితం ధరలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, అప్పుడు పద్దతి ప్రకారం పరిపాలన చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనేది అనుమానంగానే ఉందన్నారు. కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వగా, ప్రస్తుతం నా లుగు కేజీలు ఇస్తున్నారని, మిగతావన్ని కాంగ్రెసోల్లు పంది కొక్కుల్లా తింటున్నారని చంద్రబాబు అన్నారు. నేను మీ వద్దకు పదవి కోసం రాలేదు మీ కష్టాలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానన్నారు. పేద వారికి తోడుగా ఉండి వారి ము ఖాల్లో ఆనందాన్ని తప్పకుండా చూస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తున్న మహిళా సోదరిమణుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నారు.

పల్లెల రూపు రేఖలు మారుస్తా..: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పల్లెల రూపురేఖలు మారుస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి ఉందని, పారిశుద్ధ్యం అస్తవ్యస్థంగా ఉం దని, నేను పర్యటించిన ప్రతీ గ్రా మంలో ఎంతో మంది ఆడపడుచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇది తనకెంతో బాధ కలిస్తోందన్నారు. ఈ కాం గ్రెస్ ప్రభుత్వం తాగడానికి మంచినీళ్లు ఇవ్వదు కానీ మద్యం ఎంత కావాలంటే అంత ఇస్తుందన్నారు. తాను అధికారంలోకి రాగానే రెండో సంతకం బెల్టు షా పుల రద్దుపైనే పెడతానన్నారు. గ్రామాలను ప్రగతి పథంలో నడిపించే బా«« ద్య త తెలుగుదేశం పార్టీ తీసుకుందన్నారు.