May 9, 2013

మైనింగ్ మాఫియాపై కొన్నేళ్లుగా పోరాటం వైఎస్, గాలి కలిసి దోపిడీ చేశారు : చంద్రబాబు

కాంగ్రెస్ అసమర్థత వల్లే కుంభకోణాలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే దేశంలో కుంభకోణాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కుంభకోణాలపై కోర్టులే స్పందిస్తున్నాయని, కేంద్రం ప్రేక్షకప్రాత వహిస్తోందన్నారు. దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్రధాన మంత్రి నిర్వేదంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైనింగ్ మాఫియాపై గత కొన్నేళ్లుగా పోరాడుతున్నామని గుర్తుచేశారు.

వైఎస్ అవినీతిపై తాము పోరాడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ కలిసి పార్లమెంటులో ఈ అంశాలను చర్చకు రానివ్వలేదు అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దులను చెరిపే

కర్నాటకలో కాంగ్రెస్ నైతికంగా ఓడిపోయిందన్నారు. టీడీపీని భూస్థాపితం చేస్తామని గాలి ప్రగల్భాలు పలికారని, అలాంటిది కర్నాటకలో గాలి పార్టీకి అడ్రస్ లేకుండా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా కన్నడ ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
సినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్, గాలి కలిసి దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. పిల్ల కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కాలి చికిత్స కోసం ఢిల్లీలో ఉంటే కుట్ర చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్ల కాంగ్రెస్ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రిపైనే కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే సుప్రీం కోర్టును ఎవరైనా ప్రభావితం చేయగలరా అని బాబు ప్రశ్నించారు.