May 5, 2013

టీడీపీ మండలి పక్ష నేతగా యనమల

హైదరాబాద్ : తెలుగుదేశం శాసనమండలి పక్ష నేతగా యనమల రామకృష్ణుడు నియమితులయ్యారు. దీంతో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో శనివారం ఎమ్మెల్సీల భేటీ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉప నేతలుగా వుల్లోల గంగాధర్ గౌడ్, నన్నపనేని రాజకుమారి, పి.శమంతకమణి, విప్‌గా పట్నం నరేందర్ రెడ్డి, కార్యదర్శిగా ఎస్వీ స

అంతకుముందు శాసనమండలి సభ్యుడుగా చైర్మన్ కార్యాలయంలో యనమల ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ- చట్టసభల గౌరవం పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. మండలి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంపై నిషేధం తొలగింపునకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావుకు పార్టీ రాజకీయ జీవితాన్నిచ్చిందని, కేబినెట్ హోదాగల ప్రతిపక్ష నేత పదవితో గౌరవించిందని గుర్తుచేశారు. ఇన్నేళ్లుగా ఇలా ఆదరించిన పార్టీని వదిలి, అధినేతపై విమర్శలు గుప్పించడం ఆయన స్థాయికి తగదన్నారు.
తీష్‌కుమార్ రెడ్డి, కోశాధికారి మహ్మద్ సలీం నియమితులయ్యారు