May 13, 2013

సీబీఐ చార్జిషీట్లు వేసినా తొలగించకపోవడం దారుణం

గవర్నర్‌ను కలిసి చంద్రబాబు విజ్ఞప్తి
పెదవి విప్పని గవర్నర్ నరసింహన్

హైదరాబాద్, మే 13 : రాష్ట్ర మంత్రివర్గంలోని కళంకిత మంత్రులను తక్షణం తొలగించాలని గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. తమపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన ఇక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 'ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. వారిలో ముగ్గురిపై సీబీఐ ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేసింది. ఒక మంత్రికి ఫెరా నేరారోపణల కింద కోర్టు జరిమానాతో పాటు శిక్ష విధించింది. ఈ మంత్రులను ఇంకా పదవుల్లో కొనసాగించడం ప్రజాస్వామ్యానికే అవమానం. తక్షణం వారిని తొలగించేలా ముఖ్యమంత్రిని ఆదేశించండి.
ఆయన ఆ పని చేయకపోతే రాజ్యాంగ పరిరక్షకునిగా మీరు వారిని డిస్మిస్ చేయండి. ప్రజలకు ప్రజాస్వామ్యవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లకుండా చూడండి' అని ఆయన గవర్నర్‌ను కోరారు. సుప్రీం నోటీసులందుకున్న ఆరుగురు మంత్రులతో పాటు ఫెరా కేసులో శిక్ష పడిన మంత్రి పార్థసారథి పేరును వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు రాజ్‌భవన్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 'జగన్ కేసులో రూ. 43 వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ ఇప్పటివరకు వేసిన చార్జిషీట్లలో పేర్కొంది. ఈ అవినీతికి అవకాశం ఇచ్చిన జీవోలను జారీ చేసిన మంత్రులు రాజీనామా చేయక్కర్లేదని సీఎం కిరణ్ అభయం ఇచ్చి వెంటపెట్టుకొని తిరుగుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టం.
రాష్ట్రపతిని కలవడం సహా అన్ని మార్గాలు అన్వేషిస్తాం. గవర్నర్ ప్రతిస్పందనను బట్టి మేమంతా మరోసారి భేటీ అయ్యి తదుపరి కార్యాచరణను నిర్ణయించుకొంటాం' అని ఆయన వివరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, నామా నాగేశ్వరరావు, ఎన్.శివప్రసాద్, కె. ķ