January 25, 2013
తిరగబెట్టిన కాలు నొప్పి!
విజయవాడ, జనవరి 24 : చంద్రబాబు కాలు నొ ప్పితో బాధ పడుతున్నారు. ఆయ న ఎడమ
కాలు చిటికెన వేలుకు వాపు రావటంతో గురువారం కుం టుతూనే పాదయాత్ర పూర్తి
చేశా రు. నొప్పి ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం భోజన విరామానికి ముందుగానే
యాత్రకు స్వల్ప వి రామం ఇచ్చారు.
అనంతరం పల్లగిరి గ్రామంలో తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. నందిగామ పొలిమేర నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి నిలబడటంతో నొప్పిని దిగమింగుతూనే వారితో కరచాలనం చేశారు. నందిగామలో బహిరంగ సభ తర్వాత నొప్పి తీవ్రం కావటంతో వైద్యులు పరీక్షించి వేలు వాచినట్టు గుర్తించారు.
Posted by
arjun
at
11:49 AM