December 9, 2012

మొదటి సంతకం రుణ మాఫీ పైనే...

నిర్మల్: తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వస్తే మొదటి సంతకం రైతుల రుణాల మాఫీపైనే పెడతానని టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నా యుడు అన్నారు. ఆదివారం మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా కుం టాల మండలం చాక్‌పెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పాదయాత్రకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని, రైతుల జీవితాల్లో బంగారు భవిష్యత్తు నింపడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ తొమ్మిది సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని, ప్రభుత్వం రాక్షస పాలన చేస్తున్నారే తప్ప ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

ఈ రాక్షస పాలనలో ఏ ఒక్కరు అభివృద్ధి చెందలేదని, అ న్ని ంటా వెనుకబడిపోయారని అ న్నారు. రైతులకు యూరియా రేట్లు విపరీతం గా పెంచి యూరియా కోసం రైతులు క్యూకట్టి పోలీసుల లాఠీదెబ్బ లు తినవలసిన పరిస్థితులు దాపురించాయన్నారు. రైతులు తాము పంటల కోసం చేసిన రుణాలను మాఫీ చేయడానికి, రైతుల సంక్షేమం కోసం రుణ మాఫీపై మొదటి సంతకం చేసి తీరుతానని అ న్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేశామని, అప్పుడు కరెంటు కొరత ఉన్నప్పటికీ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలుగకుండా పల్లె పల్లెకు విద్యుత్‌ను అందించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండాపోతుందని, వైయస్సార్సీపీ అవినీతి కుంభకోణాల్లో కొట్టుమిట్టాడుతుందని, టీఆర్ఎస్ ప్రభావం ఏ మీ లేదన్నారు.ఈ కార్యక్రమంలో జి ల్లా ఎంపీ రాథోడ్ రమేష్, టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు గెడం నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు లోలం శ్యామ్‌సుందర్, అబ్దుల్ కలాం, నిర్మల్ నియోజక వర్గ ఇ న్‌చార్జి బాబర్, ముథోల్ నియోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి తదితరులు ఉ న్నారు.

ముస్లింల సమస్యలపై చంద్రబాబుకు వినతి: కుంటాల మండలం చాక్‌పెల్లి గ్రామంలో టీడీపీ మైనార్టీసెల్ రాష్ట్ర నేత ఎండీ యూనుస్ అఫ్ఘని నేతృత్వంలో చాక్‌పెల్లి మైనార్టీల సమస్యలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముస్లీం మైనార్టీల అభివృద్ధికి పాటుపడతానని, వీరి సంక్షేమం కోసం రూ. 2500 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.