November 16, 2012

ప్రజా సమస్యలపై అవిశ్వాస తీర్మానం :శుక్రవారం రంగారెడ్డి జిల్లా పాదయాత్రలో చంద్రబాబు



రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేవెళ్లలో శుక్రవారం అవసరమైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదిస్తామని ప్రకటన చేశారు. ప్రజా సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, ఇతర పార్టీలు అడిగాయని కాదని చంద్రబాబు అన్నారు. అంతేకానీ ఇతరపార్టీల్లా బ్లాక్ మెయిల్ చేసి కేసుల నుంచి బయటపడడానికి, బేరాసారాలు చేసుకోవడానికి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలో ఉంటే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేదని, ప్రాజెక్టు ప్రస్థుత పరిస్థితి చూస్తే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెసు కు ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అడుగుతున్నారని, ఎప్పుడు అవిశ్వాసం పెడతారో తెలియని వారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్న వారు గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన అన్నారు.
No comments :

No comments :