November 16, 2012

వణికించే చలిలోనూ..! బాబు కోసం చేవెళ్లవాసుల ఎదురుచూపులు

వణికించే చలిలోనూ..!
బాబు కోసం చేవెళ్లవాసుల ఎదురుచూపులు
పూలు జల్లి స్వాగతిం పలికిన ముస్లింలు

ఒకవైపు చలి గజగజా వణికిస్తోంది. అయినా.. చంద్రబాబు రాక కోసం రాత్రి 11 తర్వాత కూడా ప్రజలు చలిమంటలు వేసుకుని మరీ వేచి చూశారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అంత చలిలోనూ బాబు పాదయాత్ర ఆగట్లేదు. ఆయన కోసం తండాలు, గ్రామాల్లో ప్రజలూ ఎదురు చూస్తున్నారు. కొందరు కళాకారులు చలిమంటలు వేసుకుని, వాటిలోనే డప్పులు వేడి చేసుకుంటూ.. బాబు రాక కోసం ఎదురుచూడటం కనిపించింది. చేవెళ్ల నియోజకవర్గంలో బాబుకు జనం నీరాజనం పలికారు.

చేవెళ్లలోకి ప్రవేశించగానే పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా, భవనాలపై బారులు తీరారు. మైనార్టీలు దారిలో పూలుజల్లుతూ స్వాగతం పలికారు. సభకు జనం భారీగా హాజరుకావడంతో బాబు కూడా ఉత్సాహంగా గంటకుపైగా మాట్లాడారు. గతంలో వైఎస్ పాదయాత్ర చేవెళ్ల నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో సహజంగానే బాబు పాదయాత్రకు ఇక్కడ జనస్పందన ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే శుక్రవారం నాటి యాత్రకు జనం భారీగా వచ్చారు. రోడ్లన్నీ కిక్కిరిశాయి. జనస్పందన చూసి బాబు అన్ని విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి గెలిచాక అడ్రస్ లేరని ఎద్దేవా చేశారు.

6 నెలలు ఇంట్లో పడుకుని..
కేసీఆర్‌పై చంద్రబాబు ఫైర్

కేసీఆర్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. మాటల గారడి చేసే కేసీఆర్ ఆరునెలలు ఇంట్లో పడుకుని లేచి మళ్లీ సెంటిమెంట్ రేపుతాడని, ఆయన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అసలు తాను ఆయనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టేవారా అని అడిగారు. "ఆయన తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉద్ధరించారా? ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా పలకరించారా? తాను ప్రాతిని«ధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఎప్పుడైనా వెళ్లారా?'' అని ప్రశ్నించారు.
No comments :

No comments :