October 27, 2012
షర్మిల యాత్ర చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతో పోలిస్తే వెలా తెలా పోతోంది అనటంలో సందేహించాల్సిన అవసరంలేదు…..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర శుక్రవారం నాటితో 25 రోజులు పూర్తిచేసుకుంది. మరో పక్క సమాంతరంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర కూడా కోనసాగుతూనే వుంది.
ఎవరూ
ఊహించని రీతిలో చంద్రబాబు యాత్రకు జనం బ్రహ్మరధం పడుతున్నారు. ఊరూరా ఆయనకు
నీరాజనాలు పడుతున్నారు. బాబు కూడా తన గత ధోరణికి భిన్నంగా సామాన్య జనంతో
మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు వింటున్నారు…. వాళ్లకు ధైర్యం చెబుతున్నారు….
తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. గతం కంటే ఆయన ప్రసంగాలు కూడా జనాకర్శకంగా
సాగుతున్నాయి. పైగా ఇళ్ళల్లోకి, పొలాల్లోకి ఆయన నేరుగా వెళ్ళిపోతున్నారు….
రోడ్లపక్కనే టీ స్టాల్స్ లో టీ తాగుతున్నారు…. తెలంగాణలో బాబు యాత్రను
కొనసాగనివ్వం అంటూ తెలంగాణా రాజకీయ జే ఎ సి పిలుపు ఇచ్చి, ఆ మేరకు తీవ్రంగా
ప్రతిఘటించినప్పటికి బాబు బెదరకుండా తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టారు.
ఎవరూ ఊహించని విధంగా ఎం.ఆర్.పి .ఎస్ . బాబుకు అండగా నిలిచింది. గత అయిదు
రోజులుగా తెలంగాణలో బాబు యాత్ర నిరాటంకంగా సాగిపోతోంది.
ఇదిలావుంటే
మరోపక్క ఇడుపులపాయ లో మొదలయిన షర్మిల యాత్ర కడప జిల్లా దాటి అనంతపూర్
జిల్లాలో కొనసాగుతోంది ఈమె యాత్రకు కూడా జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారు.
ఆమె ప్రసంగాలను వింటున్నారు. షర్మిల కూడా పొలాల్లోకి, ఇళ్ళల్లోకి వెళ్లి
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే చంద్రబాబుతో పోలిస్తే
షర్మిల లో పెద్ద మైనస్ పాయింట్ ఏవిటంటే రాజకీయ అనుభవం లేకపోవటమే… ఆమె
ప్రసంగాలన్నీ కేవలం కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోయటం, తెలుగుదేశాన్ని
నిందించటం తప్ప పధకాల ప్రసక్తి లేకుండా పోతోంది. ఒక పక్క చంద్రబాబు తన
యాత్ర అందరికోసం అని చెబుతుంటే షర్మిల తన యాత్ర అన్న కోసం అని
చెబుతున్నారు. బాబు యాత్ర పార్టీ వ్యవహారంగా వుంటే , షర్మిల యాత్ర కుటుంబ
వ్యవహారంగా కనపడుతోందని రాజకీయవిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల కు మరో పెద్ద మైనస్ పాయింట్ ఆమె గొంతు.. జనాకర్షక గొంతుక లేకపోవటం తో ఆమె ప్రసంగాలను జనం పెద్ద ఆసక్తిగా వినటం లేదని యాత్రలో పాల్గొన్న వైఎస్సార్ పార్టి నాయకుడొకరు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే
కొత్తగా ఏయే సంక్షేమ పధకాలు ప్రవేశ పెడతామో చంద్రబాబు చెబుతుంటే , తాము రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామని షర్మిల చెబుతున్నారు. పాదయాత్రకు ముందే బిసి డిక్లరేషన్, ఎస్ సి వర్గీకరణ, మైనారిటి డిక్లరేషన్ లాంటివాటిని ప్రకటించటం చంద్రబాబు రాజకీయ పరిణతికి నిదర్శనం ….. అయితే కేవలం జగన్ బైటికి రావటం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న రీతిలో షర్మిల ప్రసంగాలు కొనసాగుతున్నాయి…
మరో
ప్రధాన అంశం… చంద్రబాబు వయస్సు….63 ఏళ్ల వయసులో చంద్రబాబు తన యాత్రను
కొనసాగిస్తూ ఉండటంతో ప్రజల్లో ఆయన పట్ల తెలియని సానుభూతి వర్కవుట్
అవుతోంది. ఏ విధంగా చూసుకున్నా షర్మిల యాత్ర చంద్రబాబు చేస్తున్న
పాదయాత్రతో పోలిస్తే వెలా తెలా పోతోంది అనటంలో సందేహించాల్సిన అవసరంలేదు…..
Subscribe to:
Post Comments
(
Atom
)

1 comment :
please don't compare both of them and get down CBN's to new lowest level...
Post a Comment