September 1, 2013

చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర సర్వం సన్నద్ధం

 రాష్ట్ర విభజన అంశంలో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా నుంచి ఆత్మగౌరవ యాత్రకు ఆదివారం శ్రీకా రం చుడుతున్నారు. పొందుగల నుంచి ప్రారంభయ్యే యాత్ర ఐదు నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు కొనసాగి కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఎంతో కీలకమైన ప్రస్తుత తరుణంలో అధినేత చేపడుతున్న యాత్రను విజయవంతం చేసేందుకు టీడీపీ జిల్లా నాయకులు, శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి.
తెలుగుదేశం పార్టీ లేఖ వలనే రాష్ట్ర వి భజన ప్రకటన వెలువడిందని కాంగ్రెస్, వైసీపీ చేస్తోన్న ద్రుష్పచారాన్ని తిప్పికొట్టేందుకే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని నిర్ణయించారని పార్టీ నేతలు చెబుతున్నారు. పౌరుషాలకు పురిటి గడ్డ అయిన పల్నాడును ఎంపిక చేయడం చార్రిత్మకమని పేర్కొంటున్నారు. తెలుగుజాతి యావత్తు ఎదురు చూస్తున్న ఆత్మగౌరవ యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందని ధీమా కనబరుస్తున్నారు. యాత్ర నిర్ణయం నాలుగు రోజు ల క్రితం తీసుకొన్నప్పటికీ జిల్లా నాయకులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఎప్పటికప్పుడు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులతో చర్చిస్తూ ఏర్పాట్లను పూర్తి చేయించారు. జిల్లాలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేలమందికి తగ్గకుండా ఆదివారం పొం దుగలకు వెళ్లేందుకు ఏర్పాట్లుచేస్తున్నా రు. మరోవైపు కృష్ణాజిల్లా నుంచి ఐదు వేల మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే దేవినేని ఉమా పొందుగలలో చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు తరలివస్తున్నారు.
చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని వైసీపీ, టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాల్సిందిగా ప్రశ్నించాలని ఏపీఎన్‌జీవో సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఈ ప్రాంత సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రతీ ఒక్కరిని చంద్రబాబు వద్దకు తీసుకెళతామని నేతలు స్పష్టం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీసుకొన్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ యాత్రకు ఎవరూ ఆటంకం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజనకు 41మంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను తీసుకెళ్లి వైఎస్ లేఖ ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, వైసీపీ చేస్తోన్న రాజకీయ నాటకాలను చంద్రబాబు ప్రజలకు వివరిస్తారని చెప్పా
రు. ఎన్నికల సమయంలో ఢిల్లీ అహంకారానికి.. కడప పౌరుషానికి మధ్య జరుగుతోన్న పోటీ అని జగన్ చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టిన ప్రణబ్‌ముఖర్జీకి ఓటేశారు. విజయలక్ష్మి ఢిల్లీ వెళ్లి సమన్యాయం అంటా రు. ఇక్కడ సమైక్యాంధ్ర అంటారు. కాం గ్రెస్ డీఎన్ఏ వైసీపీ అని స్వయంగా దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఈ కుట్రలన్నింటిని ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను కరపత్రాలుగా వేసి ప్రజలకు పంపిణీ చేస్తారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు పొందుగల నుంచి ప్రారంభమయ్యే ఆత్మగౌరవ యాత్ర తొలిరోజున స్వల్ప మార్పు చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో గురజాల ఉండగా దానిని తీసేశారు. పొందుగల నుంచి నేరుగా దాచేపల్లి, బ్రాహ్మణపల్లి మీదుగా పిడుగురాళ్ల వరకు యాత్ర కొనసాగుతుంది. దాచేపల్లిలో నాలుగు గంటలకు, పిడుగురాళ్లలో సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్లు పుల్లారావు, యరపతినేని తెలిపారు.