November 21, 2012
ఎత్తిపోతల సోమ్ముల మీద న్యాయమూర్తుల ప్రశ్నలకు మూగనోము..
పెరేట్టిన వాడి పేరు
నోటినుండి పలకలేక
ఎత్తిపోతల పథకం
తన నాన్న సోమ్మైతే
ప్రస్తుత పాలకులు
తమకు సోకులు చేసుకొంటున్నారని
సొమ్మొకడిది సోకు ఒకరిది అని
కాళ్లకు బలపాలు గట్టుకు తిరుగుతున్న
కొత్త ఓట్ల బిక్షగత్తి వాపోయింది
నాన్న
అన్నయ్య కోసం
యుద్దప్రాతిపదికన
ఎత్తిపోతల నిర్మించి
పారించిన సొమ్ముల గురించి కుట్ర అంటుంది
ఆ సోకులు మాత్రం
ప్రస్తుత పాలకులదే అనే తర్కాన్ని లేవేదీస్తుంది
అన్నయ్య కూడా
ఎత్తిపోతల సోమ్ముల మీద
న్యాయమూర్తుల ప్రశ్నలకు
మూగనోము పాటిస్తూ
తన చెంపలు తనే నిమురుకొంటూ
నీళ్ళు నములుతున్నాడు
ఆ సొమ్ములతో
ప్రజా ప్రతినిధులను గొర్రెలను
కొన్నట్టు కొంటున్నారని
ప్రతిపక్ష నాయకుడు వాపోతున్నాడు
courtesy: www.chaakirevu.wordpress.com
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment