టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం నిర్వహించిన పాదయాత్రలో ప్రధానంగా మహిళా
సమస్యలపైనే దృష్టి సారించారు. వారి ఇబ్బందులను తెలుసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఉదయం తురుకల సోమారం క్రాస్ నుంచి బయలుదేరి దేవీలాల్ తండా, పర్వతగిరి, కల్లెడ, బూర్గుమడ్ల,
మేచరాజుపల్లి గ్రామాల మీదుగా ఎర్రబెల్లిగూడెం శివారు వరకు పాదయాత్ర జరిపారు. పర్వతగిరిలో
మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. సృజన
మిర్చి పొడి తయారీ యూనిట్ మూసివేత కారణాలు తెలుసుకొని ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు.
డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. సృజన సంఘానికి ఎన్‌టీఆర్
ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. బాబు యాత్ర ప్రధానంగా తండాల
మీదుగా సాగడంతో, గిరిజనులతో మమేకం అయ్యారు.