January 6, 2013
డ్వాక్రా సంఘాలను భ్రష్టు పట్టించారు

సుమారు గంట పాటు వారితో మాట్లాడా రు. డ్వాక్రా సంఘాల ప్రస్తుత పనితీరుపై ప్రత్యేకంగా
వాకబు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలో డ్వాక్రా గ్రూప్‌లను
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసామన్నారు. పేద మహిళలకు చదు వు లేక పోయిన తెలివి తేటలు
ఉన్నాయి. వారికి చేయూత నిస్తే ఆర్ధికంగా తమ కాళ్ళమీద తా ము నిలబడతారనే నమ్మకంతో డ్వాక్రా
సంఘాలను ప్రోత్సహించామన్నారు. మహిళల జీవితా ల్లో వెలుగులు తీసుకురావడనాకి వెలుగు ప్రాజెక్టును
కూడా ప్రవేశపెట్టాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఐకెపీగా మార్చిం
ది. కొత్త సీసాలో పాత సారాల. సరిగా అమ లు చేయకా దాన్నీ అధ్వాన్నస్థితికి తీసుకువచ్చింది.
డ్వాక్రా సంఘాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీసిందని అన్నారు. ఈ తొమ్మిదేళ్ళు
టీడీపీ అధికారంలో ఉంటే మహిళలకు ఆర్ధికంగా అనే క వెసులుబాటులు లభించేవి. కానీ కాంగ్రెస్‌కు
ఓటు వేసి తప్పు చేశారు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవాన్ని
తీ సుకురావడానికి సభ్యులు సూచనలు, సలహా లు కోరారు.
చంద్రబాబు: డ్వాక్రా సంఘాలు ఇప్పుడు ఎ లా పని చేస్తున్నాయి?
సభ్యులు: అన్నీ కుంటుపడ్డాయి.
చంద్రాబాబు: ఎందుకు?
సభ్యులు: బ్యాంకులు సరిగా అప్పులు ఇవ్వడం లేదు. కాళ్ళరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవ
డం లేదు.
చంద్రబాబు: ఇచ్చిన చోట ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు?
సభ్యులు: రూపాయి నుంచి రెండు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
చంద్రబాబు: తెలుగుదేశం ప్రభుత్వ హయాం లో డ్వాక్రా గ్రూప్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు
చేసిన యూనిట్లు ఎలా పని చేస్తున్నాయి?
సభ్యులు: దాదాపు అన్నీ మూత పడ్డాయి.
చంద్రబాబు: ఎందుకు?
సభ్యులు: ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం.మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్
సౌకర్యా లు కల్పించకపోవడం. యూనిట్ నిర్వహణకు అవసరమైన శిక్షణ లేకపోవడం.
చంద్రబాబు: డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు సహకరించడం లేదా?
సభ్యులు: ఏ మాత్రం లేదు. టీవీల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పావలా వడ్డీకి
రుణాల ను ఓ పెద్ద ప్రచారం చేసుకుంటున్నాడు. దాన్ని చూసి బ్యాంకు వెళ్ళి అడిగితే రుణాలు
లేవంటున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నాడు కదా అం టే ఆయన్నే తీసుకురాపో అంటున్నారు.
చంద్రబాబు: డ్వాక్రా గ్రూప్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన పర్వతగిరి మిర్చి పొడి
యూనిట్ ఎందుకు మూతపడింది.
సభ్యులు: యూనిట్ స్థాపనకు ఐవోసి బ్యాంకు నుంచి రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాము.
మా వాటా ధనం రూ.45 లక్షలు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక, మార్కెటింగ్ తెలియక
ఖాయిలా పడింది. వడ్డీ రూ. 12 లక్షలకు చేరుకున్నది.బ్యాంక్‌వారు తాము ఇచ్చిన అప్పు,
వడ్డీ కింద యూనిట్‌ను జప్తు చేసుకున్నారు.
చంద్రబాబు: యూనిట్ తిరిగి పని చేయడానికి ఏం చేయాలి?
సభ్యులు: మీరు డబ్బులు ఇవ్వాలి
చంద్రబాబు:అప్పు చేసేది మీరు. తీర్చేది నే నా? (చమత్కారంగా)
చంద్రబాబు:యూనిట్ నడవడానికి ఏం చేయాలి?
సభ్యులు: వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలి. ఇప్పటి వరకు బ్యాంకుకు కట్టిన వడ్డీ
మొత్తాన్ని తిరిగి గ్రూప్‌కు ఇంతా అని తిరిగి చెల్లించడం.
చంద్రబాబు: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఖాయిలా పడ్డ అన్ని
డ్వాక్రా యూనిట్లకు ఇది వర్తింప చేస్తాను. పర్వతగిరి మిర్చి యూనిట్ తక్షణం తిరిగి పని
చేసేందుకు బ్యాంకర్లతో మాట్లాడి ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తాను.
బ్యాంక్ లెక్కలన్నీ ట్రస్ట్‌కు పంపించండి. దీనిని ఒక మాడల్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాము.
ఇది విజయవం తం అయితే రాష్ట్రంలో ఖాయిలా పడ్డ ఇతర యూనిట్లను కూడా ఇలాగే ఆదుకుంటాం.
ఈ ముఖాముఖి కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు,
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మలే ్లశం, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు
సీతక్క, పరిటాల సునీత, సినీనటి కవిత, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హనుమంత్ షిండే, డ్వ్రాక్రా
గ్రూప్ లీడర్ రాజమణి తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:37 AM