May 3, 2013

గొప్పల సీఎం..పోస్టులు భర్తీ చేయని వైనం: నర్సిరెడ్డి
హైదరాబాద్: ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్(గండిపేట)లో మహానాడు
నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మహాసభలకు రాష్ట్రం
నలుమూలల నుంచి పది వేల మంది ప్రతినిధులను ఆహ్వానించాలని సూచనప్రాయంగా
నిర్ణయించారు. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
శుక్రవారం తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
పాదయాత్ర విజయవంతమైన నేపథ్యంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు పూర్తి విశ్రాంతి తీసుకున్న అనంతరం పాదయాత్ర చేయని ఆరు జిల్లాల్లో బస్సు యాత్ర చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక ఎన్నికల సంవత్సరం మొత్తం ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. బస్సు యాత్ర అనంతరం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయం జరిగింది.
27,28 తేదీల్లో గండిపేటలో మహానాడు
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం ఉదయం పరామర్శించారు. 'వస్తున్నా
మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఏడు నెలల తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన బాబును
ఆయన నివాసంలో నారాయణ కలుసుకుని మాట్లాడారు.
చంద్రబాబును పరామర్శించిన నారాయణ
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం
అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పాదయాత్ర ముగించుకుని ఏడు
నెలల తర్వాత నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు,
దాడి వీరభద్రరావు రాజీనామా, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఈనెల 27న మహానాడు
ఏర్పాట్లు తదితర వాటిపై చర్చించినట్లు సమాచారం.
ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం
హైదరాబాద్ : ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డును శనివారంనాడు
ప్రకటించనున్నట్లు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి
వెల్లడించారు. ఈ ఏడాది ఒరియా భాషకు సంబంధించి ఈ అవార్డును
ప్రకటిస్తున్నామని చెప్పారు. అవార్డుకు సంబంధించిన జ్యూరీ శనివారంనాడు
సమావేశమై అవార్డు గ్రహీతను నిర్ణయిస్తుందని, అనంతరం ఏర్పాటు చేయనున్న
విలేఖరుల సమావేశంలో ప్రకటిస్తుందని వెల్లడించారు.
రేపు ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డు ప్రకటన
Subscribe to:
Posts
(
Atom
)