September 10, 2013
42రోజుల సమ్మెను పట్టించుకోరా!: చంద్రబాబు
నలభై రెండు రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.మనం బిచ్చగాళ్లమా అని
ఆయన ప్రశ్నించారు.ఖబడ్దార్ తెలుగుజాతి తో పెట్టుకోవద్దని
హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు.ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య ను రాజివ్ గాందీ
అవమానించారని,తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్..టి.రామారావు పార్టీని
స్థాపించి ప్రభుత్వాన్ని స్థాపించారని చంద్రబాబు అన్నారు.ఎన్.టి.ఆర్.
ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూల్చితే నెల రోజుల పాటు ఉద్యమం చేసి ఇందిరగాందీ
తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.ఇప్పుడు
తెలుగు జాతిని విచ్చిన్నం చేశారని కాంగ్రెస్ పై ఆయన ధ్వజమెత్తారు.ప్రధాని
మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ,తోలుబొమ్మ మాదిరిగా ఉన్నారని అన్నారు.కృష్ణా
జిల్లాలో ఆయన బస్ యాత్ర చేస్తున్నారు.కాంగ్రెస్ హయాంలో ధరల
పెరుగుదల,అవినీతి ప్రజలను అతలాకుతలం చేశారని అన్నారు.తాను పెట్టిన దీపం
స్కీమును కాంగ్రెస్ దొంగలు ఆర్పేశారని ఆయన అన్నారు.
Posted by
arjun
at
4:01 AM