September 10, 2013
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ : చంద్రబాబు

మొదట తెలంగాణ, ఇప్పుడు సమైక్యం, ఆ తర్వాత విలీనం ఇదే వైసీపీ విధానమని ఎద్దేవా చేశారు. బెయిల్, కేసు మాఫీకి అంగీకారం కుదిరిందన్నారు. పీఆర్పీ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని అప్పుడే చెప్పానని, ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే అని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కొత్త సమస్యను సృష్టించిన ఘనత కాంగ్రెస్‌దే అని బాబు తెలిపారు.
తెలంగాణ ఇచ్చింది తామే అని అక్కడి నేతలు అంటున్నారు....టీడీపీ వల్లే ఇక్కడి నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల వర్గాల ప్రజలకు ఒప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
4:00 AM