January 6, 2013
పార్టీకోసం కష్టపడ్డ వారికి గుర్తింపు..`

పాదయాత్రలో భా గంగా బాబు బస చేసిన సోమారంలో భూపాలపల్లి, వరంగల్ తూర్పు
నియోజకవర్గాల సమన్వయ కమిటీ నేతల సమావేశం శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండ ల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ
ప్రతిసారి పొత్తులో భాగంగా భూపాలపల్లి స్థానం టీడీపీకి దక్కలేద ని మధుసూదనాచారి తర్వాత
ఆ అవకాశం ఎవరికి దక్కలేదన్నారు. 108 లా గా భూపాలపల్లి నియోజకవర్గ పార్టీకి, కార్యకర్తలకు
సేవ చేస్తున్న నియోజకవ ర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ రా వుకు కేటాయించాలని కోరారు.
పొత్తు లు పెట్టుకున్నప్పటికీ ఈసారి మాత్రం టీడీపీకే కేటాయించాలని వారు బాబు దృష్టికి
తీసుకువచ్చారు. వెంకటేశ్వర్‌రెడ్డికి మరికొంత కార్యకర్తలు తోడై సత్యనారాయణరావు పేరు
ముందస్తుగా ప్రకటించాలని, జిల్లా అగ్రనేతలు వారి స్థానాలను పదిలం చేసుకోవడానికి ఇత
ర నేతలను పొత్తులకు బలిచేస్తున్నారని బాబు దృష్టికి తెచ్చారు. నియోజకవర్గ నేతల విజ్ఞప్తిని
గుర్తించిన బాబు ఫిబ్రవ రి, మార్చి నెలల్లో కొంత మంది స్థానాలను ముందస్తుగా ప్రకటిస్తానని
అందులో సత్యనారాయణరావు పేరు ఉంటుందని బాబు హామీ ఇచ్చారు.
అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గ నేత వడ్నాల నరేందర్ మాట్లాడుతూ తాము పార్టీ
ఇచ్చిన ప్ర తి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ తెలంగాణ పై
స్పష్టత ఇచ్చిన విషయాన్ని ప్రజల్లో కి తీసుకెళ్లడంతోపాటు పార్టీ పటిష్టతకు రాజ్యసభ
సభ్యురాలు గుండు సుధారా ణి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పే ర్కొన్నారు. ఈ నియోజకవర్గానికి
చెం దిన ఒక నేత మాత్రం తాను పార్టీలో ఎందుకు ఉన్నానా అని బాధపడుతున్నానని వివరించారు.అనంతరం
బా బు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కో సం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూ చించారు. ఎవరూ
నిరుత్సాహపడాల్సి న అవసరం లేదని కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని
హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీ పీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, ఎర్రబెల్లి
దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, సీతక్క, గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:38 AM