January 6, 2013
పాదయాత్రలో ద్విముఖ వ్యూహం

2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఇప్పటి పార్టీని సిద్ధం
చేసేందుకు మొద లు పెట్టిన కసరత్తులో పార్టీ శ్రేణులు పూర్తిగాభాగస్వామ్యం అయ్యేలా అన్ని
జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస చేసిన ప్రాంతంలో పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందే ప్రత్యేకంగా
ఏర్పాటు చేసిన టెంట్‌లో నియోజవర్గ సమన్వ య కమిటీ సభ్యులతో సమావేశం అవుతున్నా రు. శుక్రవారం
కూడా ఇదే చేశారు. పాదయాత్ర మొదలైన మొదటి ఏడు రోజులు పూర్తిగా అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులను
తెలుసుకోవడంపైననే దృష్టి పెట్టారు. జిల్లాలో పాదయాత్ర ముగియడానికి ఇంకా నాలుగు రోజులు
మాత్రమే మి గిలి ఉండడంతో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంపై కూడా చంద్రబాబు దృష్టి మళ్ళించారు.
శుక్రవారం జనగామ నియోజకవర్గాన్ని సమీక్షించారు. నియోజవర్గానికి చెందిన
నాయకులం తా ఇందులో పాల్గొన్నారు. పార్టీ పరిస్థితిపై ఆ రా తీసారు. పాదయాత్ర ప్రభావం
గురించి అడి గి తెలుసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా పార్టీని ప్రజల్లోకి
మరింతగా తీసుకువెళ్ళేందుకు కృషి చేయాలని హితవు పలికారు. నా యకుల తీరు పట్ల బాబు అసంతృప్తిని
వ్యక్తం చేసినట్టు సమాచారం. పాదయాత్రకు గైర్హాజరౌవుతున్న నాయకులపై ఆగ్రహం ప్రదర్శించినట్టు
తెలుస్తోంది.
పార్టీని బలోపేతం చేసేందుకు కాళ్ళ నొప్పులను భరిస్తూ 63 ఏళ్ళ వయసులో కూడా
పాదయాత్ర చేస్తుంటే నాయకులు మాత్రం తప్పించు కు తిరగడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం
చేసా రు. తాను వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేస్తుంటే నాయకులు ఎవరికి
వారు హద్దులు గీసుకొని తమ నియోజకవర్గంలో పాదయాత్ర జరిగినప్పుడే వెంట నడవ డం, ఆ తర్వాత
కనిపించకుండా పోవడాన్ని తప్పుబట్టారు. పాదయాత్ర సాగని నియోజకవర్గాల నాయకులు పాదయాత్రకు
చుట్టపుచూపు గా వచ్చిపోవడాన్ని ఎత్తిచూపారు. ఈ పరిస్థితి మారాలని పార్టీ కోసం ప్రతి
ఒక్కరు కష్టపడి ప ని చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణపై టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించిన విషయాన్ని నాయకులు, కార్యకర్తలు
ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని తీసుకువెళ్ళాలని ప్రత్యేకంగా కోరినట్టు సమాచారం.
తె లంగాణ పట్ల టీడీపీ సానుకూలతను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎలాగూ నమ్మరు. ప్రజలు
ముఖ్యంగా తెలంగాణవాదులు విశ్వసించేలా కృషి చేయాలని బాబు సూచించారు. పాదయాత్ర సందర్భంగా
నియోజకవర్గాల పరిధిలోని సమస్య లు, టీడీపీతో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై మరింత పూర్తి
సమాచారం అందచేయాలని కోరారు.
Posted by
arjun
at
5:02 AM