January 6, 2013
విత్యుత్ రంగాన్ని కుప్పకూల్చారు

కాంగ్రెస్ అసమర్థత, అవినీతితో విద్యుత్‌రంగ పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందన్నారు.
రాష్ట్రంలో 2600 మిలియన్ యూనిట్లకు పైగా అవసరం ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా ఉత్పత్తి
జరుగడం లే దన్నారు. టీడీపీ హయాంలోనే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం జరిగిందన్నారు.
నేడు విద్యుత్ బిల్లులను చూసి ప్రజల గుండెలు ఆగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇవి
చాలవనట్లుగా ప్రజలపై విద్యు త్ చార్జీలు రూ. 10 వేలకోట్లు, సర్‌చార్జీల పేరుతో మ రో
రూ. 10వేల కోట్లు రుణభారం మోపేందుకు ప్రభుత్వం పూనుకుంటుందన్నారు.
కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా మరోసారి
లేఖ అందించినట్లు వివరించారు. టీడీపీ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు స్వాగతిస్తుంటే
టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నా రు. పచ్చకామెర్లు వచ్చిన వారికి
లోకమంతా పచ్చగా ఉన్నట్లుగా టీఆర్ఎస్ పరిస్థితి దాపురిచిందన్నారు. తెలంగాణ కోసం యువకులు
బతికి పోరాడాలని ఆత్మబలిదానాలకు పాల్పడొద్దని ఆయన కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే
తెలంగాణ కోసం మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటుందన్నారు.
టీడీపీ హయాంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో
వంద సీట్లు కేటాయిస్తామని, యాదవులకు వడ్డీలేని రుణాలు, గౌ డ కులస్తులకు తాటి, ఈత వనాలు
పెంచుకునేందుకు 10 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. పద్మశాలీల సంక్షేమం కోసం వెయ్యి కోట్లు,
రజకుల కోసం దోభి ఘాట్ల నిర్మాణం, ఎస్సీ వర్గీకరణ అమలు, తండాల ను గ్రామపంచాయతీలుగా గుర్తించడం,
మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.మైదాన ప్రాం తంలో ఐటీడీఏలు నెలకొల్పనున్నట్లు
వివరించారు.
టీడీపీ హయంలో క్రమ శిక్షణతో పరిపాలన అం దించి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచి
మిగులు విద్యుత్‌ను సాధించామన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలతో కోట్లాది రూపాయాలు ప్రజల
సొమ్మును కాజేశా ని విమర్శించారు. సీబీఐ లెక్కల ప్రకారం వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి
రూ.43వేల కోట్లు కాజేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ వాస్తవానికి ఇం కా ఎక్కువగా
ఉంటుందన్నారు. రాష్ట్రంలో చదువుకు న్న యువకులందరికి టీడీపీ అ ధికారంలోకి రాగానే ఉద్యోగం,
ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని వివరించారు.కాంగ్రెస్ పాలనలో నిరుద్యో గం పెరిగిపోయిందన్నారు.
అవినీతి, అసమర్థ,రాక్షస కాంగ్రెస్ పాలనలు అంతమోదించడానికి ప్రతి ఒక్క రూ ముందుకు సాగాలన్నారు.
తాను అధికార వ్యా మోహంతో యాత్ర కొనసాగించడం లేదని ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడంతోపాటు
వారికి భరోసా ఇచ్చేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
Posted by
arjun
at
4:45 AM