January 6, 2013
రాష్ట్రంలో పనికిమాలిన ప్రభుత్వ పాలన

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం, దేశంలో అవినీతి రాష్ట్రంగా చరిత్ర పుటల్లోకి
ఎక్కిందని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగంలో రైతులకు పూర్తి స్థాయిలో పంటలు పండించుకునేందుకు
అవగాహన కల్పించడం లేదని, పండించిన పంటలకు గిట్టుబాబు లేక పెట్టిన పెట్టుబడులు రాక రైతులు
ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
తమ ప్రభుత్వం కాలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబా టు ధర కల్పించామని
ప్రతీ గ్రామానికి వ్యవసాయ విస్తీర్ణాధికారులను నియమించి అన్ని పంటలపై అవగాహన కల్పించామని
వివరించారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పౌల్ట్రీ,పాడిపరిశ్రమలను ప్రోత్సహించి సబ్సిడీలు
అందించా ల్సి ఉండగా ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించడం లేదని అన్నారు.రాబోయే
రోజుల్లో యువతను రాజకీయ రం గంలో రాణించేందుకు 33శాతం సీట్లు కల్పిస్తామని చెప్పారు.
తాగునీటి సౌకర్యం..
ఎన్టీఆర్ సుజల పేరుతో తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. బాబ్లీ
ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజలకు తీరని నష్టం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం
ప్రజలకు జ వాబుదారీగా పని చేసిందని రాబోయే రోజుల్లో అధికారం చే పట్టిన వెంటనే రోడ్లు,
సాగునీరు,తాగునీరు, కల్పిస్తామన్నా రు. రాష్ట్రంలోని విద్యార్థులందరికి సైకిళ్ళను,కంప్యూటర్లు,
ల్యాబ్‌టాప్‌లను అందించి విద్యాభివృద్ధికి తోడ్పాటందిస్తామ ని తెలిపారు.
30 కోట్లు ఇస్తామని చెప్పి మరిచారు...
వరంగల్ ఎంజీఎంకు డాక్టర్ల కొరతను తీర్చడంలో ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తున్నదని
ఆరు నెలల క్రితం ఎంజీఎం అభివృద్ధి కోసం రూ.30 కోట్లు అందిస్తామని సీఎం చెప్పి మరిచిపోయారని
అదే విధంగా కాకతీయ మెడికల్ కాలేజీలో 50 సీట్లను అధనంగా కేటాయిస్తామన్న హామీ హామీగానే
మిగిలిపోయిందన్నారు. అదే విధంగా ఆయుర్వేద కాలేజీలో అడ్మిషన్లు తీసుకోకుండా రెండేళ్లుగా
నిర్లక్ష్యం చేస్తోందని ఎంజీఎం అభివృద్ధి కోసం అవసరమైతే తమ పార్టీ ఆందోళనలను ఉధృతం
చేయనున్నట్లు తెలిపారు. ఎంజీఎంలోని చిన్న పిల్ల ల వార్డును నిలోఫర్ ఆసుపత్రి తరహాలో
అభివృద్ధి చేస్తామ ని అన్నారు.ఈ ప్రాంత ంలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని దీని నివారణ కోసం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెం టనే స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారంతా రాష్ట్రంను దోచుకోవడానికే
సరిపోయిందని ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తమ పార్టీ తెలంగాణకు అనుకూలం అన్న
విషయాన్ని 2008లోనే చెప్పి అదే విషయాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కావాలని కొన్ని పార్టీలు
తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని, అఖిల పక్ష సమావేశంలో
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం తో టీఆర్ఎస్ వర్గాల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అన్నారు.
సందర్భంగా చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వే శారు. అనంతరం అప్పుడే అటుగా
వచ్చిన ఆర్టీసీ కండక్టర్‌ను పిలిచి తమ ప్రభుత్వంలోనే మహిళలకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించామని
అయితే కండక్టర్లుగా నియమించినప్పటికి డ్రై వర్లుగా మహిళలను నియమించలేకపోయామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీ-టీడీపీ ఫొరం అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు,
ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, రాజ్యసభ సభ్యురాలు గుండు
సుధారాణి, ఎమ్మెల్సీలు బోడకంట్ల వెంకటేశ్వరు,్ల దాడి వీరభద్రరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి
చల్లా ధర్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం,మా
జీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, అనంతపురంనకు చెందిన
పరిటాల అనుచరుడు చమ న్, గట్టు ప్రసాద్‌బాబు, సంగెం మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మగడ్డ
వెంకటే శ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి గూడ సుదర్శ న్, రాష్ట్ర బీసీ సెల్ ప్రచార కార్యదర్శి
దొనికెల మల్లయ్య, నా యకులు చింతిరెడ్డి బుచ్చిరెడ్డి, సమ్మయ్య, బుక్క మల్లయ్య, మాజీ
ఎంపీపీ సొల్లేటి వీరాచారి తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
4:50 AM