January 6, 2013
'ఆమ్మా! ఇది డ్వాక్రా మహిళ సమావేశం.

* డ్వాక్రా సభ్యులు తమ గోడు చెప్పుకుంటుంటే మధ్యలో ఒక గిరిజన మహిళ లేచి
సా రూ! మా వూరికి రోడ్లు లేవు. బస్సు లేదు. కరెం ట్ సౌకర్యం లేదంటూ మొరపెట్టుకుంటుంటే...
'ఆమ్మా! ఇది డ్వాక్రా మహిళ సమావేశం. డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడుకుంటున్నాం.. కాస్త
ఆగు అని చంద్రబాబు వారించారు. చర్చ సీరియస్‌గా జరుగుతుండా ఆ మహిళ లేచి ' మా వూల్లో...'
అంటూ మళ్ళీ అవే విషయాలు చెప్పడం మొదలు పెట్టింది. ఏమ్మా.. చాలా ఉషారుగా ఉన్నావు. ఫరవా
లేదు. కాకపోతే నువ్వు రాంగ్ అడ్రస్‌కు వచ్చా వు. అవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలి.
అక్కడ చెప్పుకో అనడంతో సమావేశంలో నవ్వులు విరిసాయి.
* పర్వతగిరి మిర్చిపొడి తయారీ యూనిట్ తిరిగి నడవడానికి ఏం చేయాల ని చంద్రబాబు
డ్వాక్రా మహిళలను అడగ్గా...మహిళంతా బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించాలన్నారు ఒక్కుమ్మడిగా...
దీనితో ' ఇది మరీ బాగుందీ.. అప్పుతీసుకున్నది మీరు కట్టేది నేనా' అంటూ చమత్కరించారు.
* ఇదే సమావేశంలో డ్వాకా గ్రూప్ లీడర్లు అది మాఫీ చేయాలి. ఇది మాపీ చేయాలి
అంటూ ఒక చాంతాడంత జాబితా చదువుతుంటే.. చంద్రబాబు జోక్యం చేసుకుంటూ మాఫీలకు ఒక పద్దతంటూ
ఉంటుంది. తప్పనిసరి అనుకున్నప్పుడు కొన్ని మాఫీ చేయాలి. అన్నీ మాఫీ చేయాలంటే అసాధ్యం.
మీరడిగినట్టు ' అన్నీ మాఫీ చేస్తే .. నేను మాఫీ అయిపోతాను..' అంటూ జోక్ పేల్చారు.
* ఇదే ముఖాముఖి కార్యక్రమంలో ఒక డ్వాక్రా గ్రూప్ లీడర్ మాట్లాడుతూ టీడీపీ
తెలంగాణ ఫోరం లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ప్రశంసలు కురిపిస్తూ ఆయనను ఎన్నికల్లో
నిలబెడితే ఇక్కడే కాదు ఎక్కడైనా అనంతపురంలో అయిన సరే గెలుస్తాడని అనడంతో చంద్రబాబు
వేదికపై పక్కనే కూర్చొని ఉన్న రాప్తాడ్ ఎమ్మెల్యే సునీతను చూపిస్తూ.' ఏమ్మా! తల్లీ
పరిటాల సునీతకే ఎసరు పెడుతున్నావా' అంటూ జోకేసారు.
Posted by
arjun
at
4:47 AM