September 2, 2013
టీడీపీ ఎంపీల పోరాటం భేష్ : చంద్రబాబు
రాజ్యసభలో, లోక్‌సభలో టీడీపీ ఎంపీల పోరాటం బాగుందని టీడీపీ
చీఫ్ చంద్రబాబునాయుడు తెలిపారు. రాజ్యసభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
ఎందుకు ఆందోళన చేయడం లేదని, సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు వారికి
కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా
కొండమోడులో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా టీడీపీ
హయాంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నవారంతా
చంచల్‌గూడ జైలులో కూర్చున్నారని ఆయన తెలిపారు. రాహుల్‌గాంధీ ఓ ముద్దపప్పు
అని, ఆయన్ను ప్రధాని చేసేందుకే ఈ కుట్ర అని బాబు ఆరోపించారు.
Posted by
arjun
at
6:36 AM