September 2, 2013
చివరి రక్తపు బొట్టు వరకు అండగా ఉంటా..
రాహుల్‌గాంధీ పప్పుముద్ద అని, జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక ఉన్మాదిగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు, తెలుగుజాతిని కాపాడేందుకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. సీమాంధ్రలో 34 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. తెలుగుజాతితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదన్నారు. రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేస్తే, తర్వాత అధికారంలోకి వచ్చిన వారు దోచుకున్నారన్నారు. ఆత్మాభిమానం ఉంటే వారికి మద్దతు ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో 189 పైళ్ళను కాపాడలేని ప్రధానమంత్రి ఈ దేశాన్ని ఏమి రక్షిస్తాడని నిలదీశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను, సీమాంధ్రలో వైసీపీని సోనియాగాంధీ చెప్పులుగా వాడుకుంటుందన్నారు. మాట తప్పం.. మడమతిప్పం.. అని అన్నవంశం నేడు బెయిల్ కోసం సోనియాగాంధీ కాళ్లు పట్టుకుంటుందన్నారు. నెమలిపురి బస్టాండ్ సెంటర్లో మాజీ సర్పంచ్ గంగవరపు ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు కుమారుడు రామలక్ష్మణరావుకు పార్టీ అండదండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేసి, పంటను ధ్వంసం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని శ్రీనివాసనగర్‌వాసులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
తెదేపా జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ధూళ్ళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాదరావు, జేఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, నాయకులు వర్ల రామయ్య, నిమ్మకాయల రాజనారాయణ, పూజల వెంకటకోటయ్య, కంకణంపాటి శ్రీనివాసరావు, కొండ్రకుంట రంగారావు, గంగవరపు రామలక్ష్మణరావు, నల్లబోతుల వాసు, శనగపూల నరసింహారావు, చావా శ్యామేల్, జీ వెంకట్రావు,నాగౌతు శౌరయ్య, యెలినేడి రామస్వామి పాల్గొన్నారు.
Posted by
arjun
at
8:48 PM