September 2, 2013
శివప్రసాద్ పై సందీప్ దీక్షిత్ గూండాగిరి : నామా
పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు అందరికి ఉందని, కాని టిడిపి ఎమ్.పి
ఎన్.శివప్రసాద్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, ఎమ్.పి
సందీప్ దీక్షిత్ గూండా గిరి చేశారని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత నామా
నాగేశ్వరరావు ఆరోపించారు. సభ నుంచి సస్పెండైన శివప్రసాద్ పై కాంగ్రెస్
ఎమ్.పిలు కొట్టడానికి వచ్చారని, తెలుగుజాతి గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునే
ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తాము కూడా తెలంగాణ కోసం మాట్లాడామని, కాని
అప్పుడు ఇలా జరగలేదని, ఇప్పుడు ఎస్.సి.కమ్యూనిటి కి చెందిన మాజీ మంత్రి
శివప్రసాద్ ను సందీప్ దీక్షిత్ అవమానించారని,దానిపై స్పీకర్ కు ఫిర్యాదు
చేస్తామని ఆయన అన్నారు.ఈ పరిణామంపై ఖండిస్తున్నానని అన్నారు.
Posted by
arjun
at
6:35 AM