September 2, 2013
చంద్రబాబు యాత్రకు ఎర్రబెల్లి సమర్ధన
తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు టిడిపి అధినేత
చంద్రబాబు నాయుడు యాత్రను సమర్ధించారు.చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను
ఓదార్చేందుకే ఆత్మగౌరవయాత్రను చేస్తున్నారని అన్నారు.అంతే తప్ప తెలంగాణను
అడ్డుకునేందుకు కాదని దయాకరరావు వ్యాఖ్యానించారు.తెలంగాణ టిడిపి నేతలు
చంద్రబాబు యాత్రపై ఎలా స్పందిస్తారా అని అంతా చూస్తున్న తరుణంలో ఆ నేతలు
సానుకూలంగా స్పందించడం విశేషం.
Posted by
arjun
at
6:30 AM