September 2, 2013
చంద్రబాబుకు ఘనస్వాగతం
వావిలాలనగర్ వద్ద చంద్రబాబును కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ 2014లో టిడిపి అధికారంలోకి వస్తుందని, మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. అనంతరం యాత్ర పాకాలపాడు మీదుగా రెంటపాళ్ళ చేరుకుంది. రెంటపాళ్ళలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టిఆర్ విగ్రహాలను చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. రాత్రి బస రెంటపాళ్ళలో జరిగింది. యాత్రలో మండల టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
8:53 PM