
తెలుగుజాతిని కాపాడుకునేందుకే
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా
చంద్రబాబునాయుడు తెలిపారు. తెలుగు వాడి ఆత్మగౌరవ యాత్ర సోమవారం రాత్రికి
సత్తెనపల్లికి చేరింది. పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్‌లో జరిగిన బహిరంగ
సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకే
పుట్టిందన్నారు. ఎన్‌టి రామారావు పార్టీని ప్రారంభించి రాష్ట్రంలో
కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండా చేశారన్నారు. అప్పట్లో ప్రధాని
ఇందిరాగాంధీ టీడీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటికి మరలా ప్రజలు
ఎన్నికలలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలని
విమర్శించారు. టీఆర్ఎస్, వైసీపీలు సోనియాకు చెప్పుల్లా
పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజనపై 34 రోజులుగా ప్రజలు ఆందోళన
చేస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోవటం లేదన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్
ఒకటేనన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయిందన్నారు. పెట్రో
లు, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. పేదరిక నిర్మూలన కోసం తెలుగుదేశం కృషి
చేస్తుందన్నారు. ప్రజలు రోడ్డుమీదకు రావటానికి సోనియాగాంధీనే కారణమన్నారు.
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్, వైసీపీలకు ప్రజలు బుద్ధిచెప్పి టీడీపీకి
పట్టం కట్టారన్నారు. రాష్ట్ర విభజన వల్ల రాహుల్ ప్రధాని కాలేడన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నాడు చంచలగూడ జైలు కార్యాలయం కాగా, నేడు నిమ్స్
వైద్యశాల కార్యాలయంగా మారిందన్నారు. తాను 7రోజుల పాటు నిరాహారదీక్ష చేస్తే
ఏమీ కాలేదని, 4రోజులకే జగన్‌కు అనారోగ్యమంటూ నిమ్స్‌లో చేర్పించి
కాంగ్రెస్ డ్రామాలాడుతుందన్నారు. కాంగ్రెస్, వైసీపీలకు ప్రజలు తగినవిధంగా
గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. ఎవరితో మాట్లాడకుండా రాష్ట్ర విభజనపై కేంద్ర
ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు
ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు మన్నెం
శివనాగమల్లేశ్వర
రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ,
నాయకులు యెల్లినేడి రామస్వామి, భీమినేని వందనాదేవి, పోతుగంటి
రామకోటేశ్వరరావు, ఆర్ రామచంద్రరావు, పూదోట రాజు, పెద్దింటి వెంకటేశ్వర్లు,
చౌటా శ్రీనివాసరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, గుజ్జర్లపూడి నాగేశ్వరరావు,
మారెళ్ళ మల్లేశ్వరరావు, శ్రీశైలం మాదిగ, దర్శి రవి, బొర్రా వెంకటప్పారావు,
సయ్యద్ పెదకరిముల్లా, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఆళ్ళ సాంబయ్య, పోపూరి
కృష్ణారావు, మక్కపాటి రామచంద్రరావు, కోయ లక్ష్మయ్య, కొబ్బరి సుబ్బారావు,
పాల్గొన్నారు. బాణసంచా పేల్చి చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు.