
ఇరుప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన
కాంగ్రెస్ పార్టీకి తెలుగుప్రజలు మరణశాసనం రాయనున్నారని రాష్ట్ర తెలుగుదేశం
పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయు డు అన్నారు. ఆయన సోమవారం తె
లుగుజాతి ఆత్మగౌరవయాత్రలో భా గంగా మండలంలోని వినగడప, తోటమూల, మేడూరు,
సత్యాలపాడు, పెనుగొలను, ఊటుకూరు గ్రామాల్లో నిర్వహించిన బస్సుయాత్ర
సందర్భంగా బహిరంగసభల్లో మాట్లాడారు. తెలుగుజాతికి గుర్తింపుతెచ్చింది
ఎన్టీఆరేనని నాడు హైదరాబాద్ విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యను
రాజీవ్‌గాంధీ ఘోరంగా అవమానిస్తే ఎన్టీఆర్ ఆం«ధ రాష్ట్రగౌరవం ఢిల్లీలో
తాకట్టుపెడుతున్నారని తెలుగుదేశం పార్టీని స్థాపించి 9నెలల్లోనే
అధికారంలోకి తీసుకువచ్చి కాంగ్రెస్‌ను ఘోరంగా ఓడించారన్నారు. తెలుగుదేశం
పార్టీని ఏవిధంగానైనా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుటిలరాజకీయాలకు తెరలేపి
ఓట్లు, సీట్లు ఆధారంగా రాష్ట్రవిభజన చేసి తెలంగాణలో టీఆర్ఎస్‌ను,
సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీని ప్రోత్సహిస్తుందన్నారు. రాహుల్‌గాంధీని
ప్రధానిగా, జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ తెరవెనుక రాజకీయాలు
చేస్తుందన్నారు. కాం గ్రెస్ రాష్ట్రప్రజలను వీధులపాలు చేసిందన్నారు.
బస్సుయాత్రలో చెరుకూరి రాజేశ్వరరావు, పుల్లయ్యచౌదరి, దిరిశాల
వెంకటకృష్ణారావు, సీతారామప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి,
తదితరులు
పాల్గొన్నారు.