September 11, 2013
వైఎస్సే భయపడేవాడు ....గట్టిగా మాట్లాడితే మీ అంతు చూస్తాం

రైతులకు నన్ను నిలదేసే హక్కు ఉందని, దొంగలకు మాత్రం తనను ప్రశ్నించే హక్కులేదని ఆయన వైసిపి కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేం తలుచుకుంటే వైసిపి నేతలు ఇంట్లో నుంచి బయటకు రాలేరని,
తనకు వైఎస్సే భయపడేవాడని, అని చంద్రబాబు నాయిడు వైసిపి కార్యకర్తలను హెచ్చరించారు.
దీంతో ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలను అడ్డుకున్నారు. అంతటితో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇది చూసిన బాబు వైసిపి కార్యకర్తలను నిలువరించారు. "పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఉరుకోం'' అంటూ బాబు వైసిపి కార్యకర్తలపై నిప్పులు చెరిగారు.
జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్‌తో లాలూచి పడి నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ అసలు తెలంగాణకు బీజం వేసింది వైఎస్ అని బాబు ధ్వజమెత్తారు. జైల్లో ఉన్నా మీ నాయకుడికి సిగ్గు రాలేదు, నర్సీపట్నంలో దొంగనోట్లు ముద్రించి, ఎటిఎంలు దోచి షర్మిల పాదయాత్రలకు ఖర్చుపెట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈలోగా ఘర్షణకు దిగిన వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అక్కడి నుండి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.
Posted by
arjun
at
7:49 AM