
కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ
యాత్రలో వైసీపీ నేతలు సమైక్య నిదాలు చేశారు. దీనిపై బాబు తీవ్ర స్థాయిలో
ధ్వజమెత్తారు. పిచ్చి వేశాలు వేస్తే సహించేది లేదన్నారు. తాము తలుచుకుంటే
మీ పార్టీ నేతలు ఇంట్లో నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. సమైక్యం పేరుతో
కాంగ్రెస్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజం
వేసింది వైఎస్సే అని ఆయన తెలిపారు. మీ నాయకుడు జైల్లో ఉన్నా మీకు సిగ్గు
లేదని, గట్టిగా మాట్లాడితే అంతు చూస్తామని చంద్రాబాబు హెచ్చరించారు.