September 11, 2013
రాష్ట్ర విభజనకు ఆర్టికల్-3 ఉపయోగించటం ద్వారా ఏ కత్తితో పొడవాలో కూడా ఈ దొంగల నాయకుడే కాంగ్రెస్‌కు చెప్పాడు.
కృష్ణాజిల్లాలో ఆత్మగౌరవ యాత్రను అడ్డగించిన వైసీపీ కార్యకర్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా చండ్రనిప్పులు చెరిగారు. బుధవారం కృష్ణాజిల్లాలో ఆరో రోజున ఆయన తిరువూరు మండలం వావిలాల గ్రామం వచ్చినప్పుడు 30మంది వైసీపీ కార్యకర్తలు కాన్వాయ్‌కి అడ్డుపడేందుకు యత్నించారు. పోలీసులు తరుముతున్నా వారు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఉగ్రరూపం దాల్చి వారిపై మండిపడ్డారు. గ్రామంలో సభ అనంతరం మరోసారి కూడా వైసీపీ కార్యకర్తలను హెచ్చరించారు. "మిమ్మల్ని ఉరుకులెత్తించేవాళ్లం. దేహశుద్ధి చేస్తేగానీ మీకు బుద్ధి రాదు. పొలంలో ఉన్న రైతుకు నన్ను నిలదీసే హక్కు ఉంది. కాంగ్రెస్ వైసీపీ దొంగలకు లేదు. ఖబడ్దార్. మాతో పెట్టుకుంటే తోక కట్ చేసి పంపిస్తా. వైఎస్సారే నా దగ్గర భయపడేవాడు.. మీరెంత? రాజమండ్రిలో ఏటీఎం దోచి పాదయాత్రకు ఖర్చుపెట్టారు. నర్సీపట్నంలో దొంగ నోట్లు ముద్రిం చి ఖర్చు చేశారు. మీరా మాట్లాడేది? ఊరికి ఐదారుగురురు పనికిమాలినవాళ్లుంటారు. వాళ్లకో క్వార్టర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలు.. ఆ రోజంతా ఊళ్లో హడావుడి చేసేస్తారు'' అని దుయ్యబట్టారు.
గంపలగూడెం మండలంలోనూ బాబు యాత్ర సాగించారు. కాంగ్రెస్ ప్రభు త్వం తెలుగు ప్రజలమధ్య అనుబంధాన్ని తెంచేసి వేడుక చేసుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ సమస్యను పరిష్కరించమంటే సీమాంధ్రలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు. సోనియాగాంధీ దేశానికే శాపమని దుయ్యబట్టారు. సిగ్గు లేని వైసీపీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కలిసే రోజు వస్తుందని.. వైసీపీకి ఓటు వేస్తే సోనియాకు వేసినట్లేనని అన్నారు. దేశంలోని ఆర్థిక ఉగ్రవాదులను ఏం చేశారని ప్రధాని మన్మోహన్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైసీపీ బ్రాంచ్ ఆఫీసులుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు
Posted by
arjun
at
8:06 PM