
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని టీడీపీ
నేతలు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని వారు
తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. నీచ
రాజకీయాలు చేసే పార్టీలను టీడీపీ నమ్మదని, కేసీఆర్ చెబితే అవిశ్వాసం
పెట్టాలా అని మోత్కుపల్లి, గాలి ప్రశ్నించారు.