March 13, 2013
ఎన్నికలకు సిద్ధం కండి

ఈ ర్రాష్టాన్ని మరో బీహార్‌గా మార్చేలా జరిగే ప్రయత్నాలను తెలుగుదేశం గెలుపు ద్వారా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌పై పోరాడుతున్నామని, అయినా కూడా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఈ ఆరు నెలల్లో పార్టీ కోసం బాగా పని చేసేవారిని జైళ్ళలో పెట్టడం ద్వారా పార్టీ విజయావకాశాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కుతంత్రాలు పన్నుతుందని ఆరోపించారు. రైతులు రుణమాఫీ విషయంలో మనం ఇప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్నాం. రైతులకు మేలు చేసేలా నాకు ఒక ప్రణాళిక ఉందని స్పష్టం చేశారు.
అధికారంలోకి రాగానే బ్యాంకుల్లో ఇస్తున్న రుణాలను మాఫీ చేస్తామని, అయితే ఇప్పటి దాకా ఉన్న రుణాలు కట్టాలా, వద్దా అనేది మీరే స్వీయ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ పర్‌ఫెక్ట్‌గా ఉందని, మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. డబ్బు కాంక్షతో లీడర్లే పార్టీని వదిలిపోతున్నారే తప్ప కార్యకర్తలు అందరూ సొంత పార్టీనే నమ్ముకుని ఉంటున్నారని చంద్రబాబు పేర్కొన్నా రు. పార్టీ ఎమ్మెల్యేలు ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు పనితీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.
పార్టీ కోసం కష్టించి పని చేస్తుంటే ఓర్వలేక తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ' మిమ్మ ల్ని సీఎంగా చూసేంత వరకు ఎన్ని పోరాటాలైన చేస్తాం, మడం తిప్పం, అయినా మీరు, స్థానిక ఎమ్మెల్యేలు మాకు అండగా నిలవాలి' అని పార్టీ కార్యకర్తలు అధినేతకు, ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేశారు. యువతకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అని దెందులూ రు నియోజకవర్గానికి చెందిన నవీన్ అనే కా ర్యకర్త కోరారు. ఒక అప్పటి అభివృద్ధి చెట్టు మనది, కాయలు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కోసేసుకుంటున్నారు, మన పార్టీ ప్రజలకు కూడు పెడితే కాంగ్రెస్ పొట్ట కొట్టిందని నిడదవోలు కార్యకర్త సురేష్ అభిప్రాయపడ్డాడు.
కొల్లేరు సమస్య పరిష్కరించాలని దెందులూరు నియోజకవర్గానికి చెందిన తిరుపతి స్వామి కోరారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని నిడదవోలుకు చెందిన వెంక ట రమణారావు పేర్కొంటూ ఇక ముందు ధనిక, పేద వర్గాలను పూర్తిగా గమనించేలా మల్టీపర్పస్ కార్డును మీరే రూపొందించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మా ఎమ్మెల్యే ప్రభాకర్‌పై కేసులు పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన ముందుకు సాగారు. మీరూ అండగా నిలిచారు.. అని దెందులూరు సీనియర్ నేత రాయల భాస్కరరావు అన్నా రు. పార్టీని గెలిపించుకుంటామని, దైనికైనా సిద్ధమేనని కుటుంబ శాస్త్రి పేర్కొనగా, రైతులకు తగినంత మద్దతు ధర, ఇతరత్రా వాటి పై ఊరూవాడా విస్తృత ప్రచారం చేస్తే పార్టీకి తిరుగుండదని నిడదవోలుకు చెందిన లాల్‌బహుదూర్ అన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయు డు నిర్వహించిన సమీక్షకు దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాలకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, చింతమనేని ప్రభాకర్ పనితీరుపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ నేతల పనితీరును అధినేత దృష్టికి తీసుకువెళ్ళేందుకు చాలా మంది ప్రయత్నించారు. మా గంటి బాబు, సీతారామలక్ష్మీ తదితరులు పా ర్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని వారి పట్ల కూడా అభిమానం చాటుకున్నారు. తెలుగుదే శం పార్టీ అధికారంలోకి వస్తే మాగంటి బా బును మంత్రిగా చూడాలని, ప్రభాకర్, శేషారావులను తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని కార్యకర్తలు స్వయంగా చంద్రబాబుకే భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రభాకర్, శేషారావు, మాగంటి బాబు, ఎమ్మెల్యే శివరామరాజు, పాలిప్రసాద్, జగదీష్‌బాబు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:23 AM