March 13, 2013
మనకు తిరుగులేదు- చంద్రబాబు

పాలకొల్లు మం డలం పూలపల్లిలో బుధవారం ఉండి, భీమవరం నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ మరింత పటిష్టం కావాలంటే మీ సలహాలు, సూచనలు అవసరమని, అప్పు డే పార్టీ మరింత ధృడంగా ఉంటుందని అన్నారు. ఒకటి, రెండు సీట్లు ఉన్న పార్టీలు కూడా పేపర్లు, టీవీలు పెట్టుకున్నాయని మన పార్టీకి మాత్రం అలాంటివి లేవన్నారు.పేపర్లు,టీవీలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా మ నకు లేదన్నారు. ప్రజల దీవెనలే మన పార్టీ గెలుపునకు కారణమవుతాయన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా సీతారామలక్ష్ష్మి పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అభినందించారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పోరాడాలని, కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చా రు. పార్టీ కోసం నిర్విరామంగా పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు, ఆస్తులు తెగనమ్ముకున్న త్యాగశీలులు ఉన్నారన్నారు. మీరు అనుకుంటే ఏ దైనా చేయగలరు.
అందుకే మీరు కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో అన్ని స్థ్ధానాలను మనమే గెలుచుకుంటామని అన్నారు.ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శివరామరాజు,గాదిరాజు బాబు, సీతారామలక్ష్మీలతో సహా పలువురు నేతలు ఇలాగే కష్టపడుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.పార్టీ నుంచి రాష్ట్రంలో 16మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారని, అయితే వీరి స్థ్ధానంలో వందమందిని తయారు చేసే శక్తి టీడీపీకే ఉందన్నారు. ఆ తర్వాత ఉండి, భీమవరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మీకోసం ఏదైనా చేస్తాం కార్యకర్తలు
'పార్టీ కోసం తుది రక్తం బొట్టు వరకు పని చేస్తాం.. భీమవరంలో తోట సీతారామలక్ష్మీ, గాదిరాజు బాబు, మెంటే పద్మనాభంలలో ఎవరినో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించండి. ఇప్పుడున్న గందరగోళం తొలగుతుంది, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీని నరసాపురం ఎంపిీగా నిలబెట్టండి అని భీమవరం నేత కొట్టు సత్యనారాయణ (బాబు) విజ్ఞప్తి చేశారు.అయితే నాయకుల పేర్లు చెప్పి మాట్లాడొద్దంటూ ఆయనను చంద్రబాబు సముదాయించారు. బీసీల కోసం మీరు చేస్తున్న సేవలు, ఇస్తున్న ప్రాధాన్యం అద్భు తం.. ఈ పార్టీ బీసీలదే, మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్నాం అని కార్యకర్త కడలి నెహ్రూ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో డబ్బుకే ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి రాజకీయాలను ఇకముందు తరిమికొడతాం అని మరో కార్యకర్త మావుళ్ళయ్య అన్నారు. అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో ఇల్లు కట్టిస్తామన్నారు, దీనిని లక్షన్నరకు పెంచాలని ఉండి నియోజకవర్గ కార్యకర్త సాయికృష్ణ సూచించారు. మిమ్మల్ని సిీఎం చేస్తాం, పార్టీ కోసం కష్టపడతామని ఇంకొక కార్యకర్త కోనా నాగేశ్వరరావు అన్నారు.
డ్వాక్రా సం ఘాల పరిస్థ్ధిితి అధ్వాన్నంగా ఉందని, వీరిని ఆదుకోవాల్సి ఉందని వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు సూచించారు. పార్టీలో పరిస్థ్ధిితిని చక్కదిద్దడం ద్వారా మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆకివీడుకు చెందిన గణపతి కోరారు. ఇప్పుడు రాష్ట్రంలో దొంగలు పడ్డారని, వీరిని తరిమికొట్టి బాబును సీఎంగా గెలిపిస్తేనే మనబిడ్డల భవిష్యత్‌కు మంచి జరుగుతుందని భీమవరం నేత వేగి మాధవరావు పేర్కొన్నారు.
Posted by
arjun
at
11:02 PM