April 28, 2013
ర్యాలీ సాగిందిలా..
.jpg)
3.30 గంటలు: టీడీపీ అధినేత చంద్రబాబు కూర్మన్నపాలెం నుంచి పాదయాత్ర చేపట్టారు.
4.05: శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. «థింసా, కోలాటం, పులివేషాలు, చెంచు నృత్యం, బిందెల నృత్యం, ఎన్‌టీ రామారావు, బాలకృష్ణ డూప్‌లు, సైకిల్ గుర్తు వంటి వాటిని ప్రదర్శించే 12 ట్రాలీలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీ మార్గంలో జనం చంద్రబాబుతో కరచాలనం చేసేందుకుపోటీ పడ్డారు. దీంతో ర్యాలీ చాలా నెమ్మదిగా సాగిం
4.30: ర్యాలీ కూర్మన్నపాలెం జంక్షన్‌కు చేరుకోగానే టీఎన్‌టీయూసీ నాయకులు చంద్రబాబును పూలమాలలతో ముంచెత్తారు.
4.55: ర్యాలీ కణితి బస్టాప్ వద్దకు చేరుకుంది. పోలీసుల వేషధారణలో కొంతమంది కార్యకర్తలు వాహనాలపై వచ్చి ర్యాలీలో చేరారు.
5.05: శ్రీనగర్ వద్ద పలువురు మహిళలు చంద్రబాబుకు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు.
5.15: ర్యాలీ చినగంట్యాడ జంక్షన్ చేరుకుంది. ఈ సమయంలో ఎన్‌టీఆర్ వేషధారణతో ఉన్న ఓ వ్యక్తి ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
5.25: గాజువాక జంక్షన్‌లో కూడా భారీ సంఖ్యలోని మహిళలు చంద్రబాబుకు మంగళహారతులతో స్వాగతం పలికారు.
5.37: బీహెచ్‌పీవీ కూడలి వద్ద టీఎన్‌టీయూసీ నేతలు టీడీపీ అధినేతను పూలదండలతో సత్కరించారు.
6.05: ర్యాలీ ఎన్ఏడీ కూడలికి చేరుకుంది. అప్పటికే నాలుగు రోడ్లూ జనసంద్రంగా మారాయి. ఈ దృశ్యాన్ని చూసిన చంద్రబాబు, బాలకృష్ణతో పాటు ఇతర నేతలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. సుమారు పది నిమిషాల తర్వాత ర్యాలీ తిరిగి ప్రారంభమైంది.
6.25: బిర్లా జంక్షన్ వద్దకు చేరుకోగా రోడ్డుకిరువైపులా నిలబడిన జనం చంద్రబాబుకు అభివాదం చేశారు.
6.35: కంచరపాలెం ఇందిరానగర్ వద్ద స్థానికులు చంద్రబాబుకు తలపాగా బహూకరించారు.
7.15: చంద్రబాబు కాన్వాయ్ మద్దిలపాలెం మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుంది.
Posted by
arjun
at
12:34 AM