
హైదరాబాద్ తర్వాత బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్, ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రి,
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి
చేరుకుంటారు. కొంత విరామం తర్వాత పంజాగుట్ట, తార్నాక మీదుగా ఉప్పల్‌కు
వెళతారు. అక్కడ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు
పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఇంటివరకు భారీ ఎత్తున ర్యాలీ
నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన
కేంద్రం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు.
: సుదీర్ఘ పాదయాత్ర అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబునాయుడు ఆదివారం నగరానికి విచ్చేస్తున్నారు. దీంతో ఆయనకు ఘన
స్వాగతం పలికేందుకు నగర టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న
చంద్రబాబు రాజేంద్రనగర్ మీదుగా ఆరామ్‌ఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం మీదుగా
ర్యాలీగా వస్తారని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్
తెలిపారు. ఈ సందర్భంగా మాసాబ్‌ట్యాంక్ వద్ద భారీ బహిరంగ సభలో చంద్రబాబు
ప్రసంగించనున్నారు.