April 28, 2013
జగన్ కోసం జైలు..జైలు కోసం జగన్.........వానపాము బుసకొట్టినట్లు షర్మిల సవాల్
చరిత్ర తిరగరాస్తాం
టీడీపీకే మళ్లీ అధికారం..
రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్
పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయ్
జైలు పార్టీగా మారిన వైసీపీ
కేసీఆర్‌కు బాబును విమర్శించే అర్హత లేదు..
విశాఖ సభలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

జగన్ అవినీతి విశ్వవ్యాప్తంగా తెలుసు: నర్సిరెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం జగన్ పాకులాడితే.. కాంగ్రెస్ అధిష్ఠానం అతన్ని సీబీఐకి అప్పగించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ తన హయాంలో ప్రజల బాగోగులు చూడకుండా బంధుప్రీతితో వ్యవహరించారని విమర్శించారు. జగన్ ర్రాష్టాన్ని ఏ విధంగా దోచుకున్నారో విశ్వవ్యాప్తంగా అందరికీ తెలుసునన్నారు. కాంగెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలకన్నీ కష్టాలేనని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు పెరిగాయని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల చరిత్రలో చంద్రబాబు అమలు చేసిన అనేక పథకాలను ఆయన గణాంకాలతో సహా వివరించారు.
కేసీఆర్ వసూల్ రాజా: రమేష్ రాథోడ్ఈ ర్రాష్టాన్ని తల్లి, పిల్ల కాంగ్రెస్ పూర్తిగా దోచుకుంటున్నాయని ఆదిలాబాద్ ఎంపీ రమేష్‌రాథోడ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి పథకం వంటి వాటితో కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే జైల్లో ఉన్న జగన్ బృందంతో పాటు అవినీతి మంత్రుల కోసం కొత్తగా జైలు కట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను వసూల్ రాజాగా అభివర్ణించారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని కలెక్షన్లు లెక్కబెట్టుకునే వ్యక్తికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మండి పడ్డారు.
ఆత్మహత్యల్లో రాష్ట్రం తొలి స్థానం: సోమిరెడ్డి తెలుగుదేశం హయాంలో అభివృద్ధి విషయంలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే మడమ తిప్పకుండా కోట్లాది రూపాయలు దోచుకున్నాడని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా వ్యహరిస్తున్నాయి కాబట్టి ప్రజలకు అంతోఇంతో న్యాయం జరుగుతున్నదని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కూడా అమ్మేస్తుందని ఎద్దేవా చేశారు.
Posted by
arjun
at
12:14 AM