April 28, 2013
విశాఖ సభలో ఆకట్టుకున్న బుర్రకథలు,మిమిక్రీ
సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్
ఉత్సాహపరిచిన సంగీత విభావరి

టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను క«థకుడు తెలియజేస్తుంటే సభా ప్రాంగణంలో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. వీర్నాల కృష్ణ సారథ్యంలో జానపద కళాకారులు తమ గీతాలతో ఆకట్టుకున్నారు. మిమిక్రీ కళాకారులు హరికిషన్, నాగభూషణ్ ... ఎన్టీఆర్, రావుగోపాలరావుతోపాటు హాస్యనటుడు ఎమ్మెస్‌నారాయణ సభకు విచ్చేసినట్టయితే ఏ విధంగా మాట్లాడతారో చక్క
'కదిలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా...త్యాగాలకు వెనుదిరగని దేశభక్తులారా..'అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన తొలి గీతానికి కార్యకర్తలు ఉప్పొంగిపోయారు. ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి చిత్రం నుంచి మనో ఆలపించిన 'జననీ జన్మభూమిచ్ఛా స్వర్గాదపీ, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి' వంటి గీతాలకు అభిమానులు నృత్యాలు చేశారు. చంద్రబాబు పాదయాత్ర సభా ప్రాంగణానికి చేరే సమయంలో మనో,వందేమాతరం శ్రీనివాస్, సునీత..'చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, సంభవం నీకే సంభవం, ధర్మానికి నువ్వే రాజువై వంటి గీతాల పల్లవులను పాడి హుషారెక్కించారు.
తరువాత చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బందీ అయిపోతుందో తదితర గీతాలు వేదికపై నేత లను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల కోరిక మేరకు బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం చిత్రంలోని జగదానంద తారక, జయజానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం' అంటూ మనో, సునీత ఆలపించగా సభా ప్రాంగణం హర్షాధ్వానాలతో దద్దరిల్లింది.
Posted by
arjun
at
12:25 AM