March 28, 2013
ఏడు గంటలు విద్యుత్ సరాఫరా చేయాలి : పరిటాల సునీత

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులకు ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం గంట సేపు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు, ప్రజల సమస్యలపై హైదరాబాద్‌లో 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. వీటిని రాజకీయ లబ్ధికోసం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు, ప్రజల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరం కోసం రూ.30 కోట్లు నిధులు విడుదల చేస్తే కొంతమేర నీటి ఎద్దడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు పరిటాల మహీంద్ర, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయడు, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, జిల్లా మైనార్టీ నాయకులు సైపుద్దీన్, టీడీపీ రూరల్ మండల కన్వీనర్ వేంకటేష్, మాజీ ఎంపీటీసీలు వీరాంజినేయులు, వేణుగోపాల్, సూర్యనారాయణ, నాయకులు మారినేని లక్ష్మీనారాయణ, కొం డయ్య, గంగాధర్‌నాయుడు, సొసైటీ డైరెక్టర్ వెంకటప్ప, నూర్‌బాషా, ము ఖేష్‌శీనా, సాంబశివుడు, షపీ, రఘు, మునిరెడ్డి, రుద్రయ్య, నారాయణరెడ్డి, శ్రీరామిరెడ్డి, శ్రీరాములు, బీసీ సెల్ బాబు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
10:46 PM