
కాకినాడ తెలుగుదేశం పార్టీ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పు
గోదావరి జిల్లా పెదపూడిలో శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జిల్లాలో
పాదయాత్రచేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఉత్సవంలో
పాల్గొననున్నారు. ఉదయం 9 గంటల నుంచీ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు
నిర్వహిస్తున్నారు. పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న నేతలను
సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఏర్పాటుచేశారు.