
" రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగిన శక్తి చంద్రబాబుకు ఉందని ప్రజలు
అనుకొంటున్నారు. చంద్రబాబు సమర్థుడైన నేత. అలాంటి వారు రావాల్సిన అవసరం
ఉంది. దీక్షా దక్షతలు కలిగినవాడు. ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం
బాగుపడుతుంది. విద్యుత్‌తో ప్రజలకు దూరమైన టీడీపీ ఇప్పుడు అదే
విద్యుత్ఉద్యమంతో ప్రజలకు చేరువ అవుతోంది. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు
అన్నారని ప్రజలు నమ్మడంలేదు. వ్యవసాయాన్ని వదిలి లాభదాయక వృత్తులను
చూసుకోవాలని వైఎస్, రోశయ్య కూడా చెప్పారు. మా జెండా నీడలో అధికారంలోకి
వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేం ఉద్యమం చేస్తుంటే పట్టించుకోవడంలేదు.
దీని ఫలితం ఆ పార్టీ అనుభవిస్తుంది''
-టీడీపీ ఎమ్మెల్యేల దీక్షాశిబిరం వద్ద సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు