
హైదరాబాద్ ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో విద్యుత్ సమస్య చర్చకు
రావద్దని వైఎస్సార్ సీపీ భావించిందని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యపై తాము
వామపక్షాలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని టిడిపి నేత
మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఏప్రిల్ 9వ తేదిన తాము బందుకు
పిలుపునిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సమస్య పైన తాము చేపట్టిన దీక్షను
అవహేళన చేయడం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం
స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కాగా, తూర్పు గోదావరి
జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న అధినేత నారా చంద్రబాబు
నాయుడు టెలి కాన్ఫరెన్సు ద్వారా నిరాహార దీక్ష చేస్తున్న నేతలతో
మాట్లాడారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బాబ్లీ పైన అఖిల పక్షం
సమావేశమైంది. అఖిల పక్షానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుండి
ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర రావు, విజయ రమణరావు, తెలంగాణ
రాష్ట్ర సమితి నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి వినోద్ కుమార్, విద్యాసాగర
రావు, వైయస్సార్ కాంగ్రెసు నుండి కెకె మహేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర
రావు, బాజిరెడ్డి గోవర్ధన్, సిపిఎం నుండి జూలకంటి రంగారెడ్డి,
మల్లారెడ్డి, మజ్లిస్ నుండి జాఫ్రి, భారతీయ జనతా పార్టీ నుండి శేషగిరి
రావు, అధికార పార్టీ నుండి పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబులు హాజరయ్యారు.
: రాష్ట్రంలో ఇంతటి విద్యుత్ సమస్యకు దివంగత మాజీ
ముఖ్యమంత్రి వైఎస్. రాజవేఖర్‌రెడ్డే కారణమని టీడీపీ సీనియర్ నేత గాలి
ముద్దు కృష్ణమ నాయుడు ఆరోపించారు. కాబట్టి విద్యుత్ సమస్యపై «వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయాలనుకుంటే యమలోకంలో చేయాలని ఆయన ఎద్దేవా
చేశారు.