March 28, 2013
పెదపూడిలో నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం

కాపు సామాజికవర్గంపైనే ప్రధాన గురి... జిల్లాలో బీసీ, మాదిగ ఉప కులాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక జిల్లా రాజకీయాల్లో కీ లక సామాజికవర్గమైన కాపులను తమవైపు తిప్పుకోవడంపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలో అడుగుపెట్టింది మొదలు... ప్రతి సభలోనూ అగ్రవర్ణాల్లో కాపులలో పేదలు ఎక్కువగా ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. కాపుల్లో పేదలకు రిజర్వేషన్లు, కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తానని పదేపదే ప్రస్తావిస్తున్నారు. మండపేటలో రాష్ట్ర కాపునేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
పెదపూడిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం..అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి చంద్రబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు.
Posted by
arjun
at
10:42 PM